Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్: అవినీతిమయమైన రాజకీయ వ్యవస్థ పై 'గాడ్సే' పోరాటం..!

By:  Tupaki Desk   |   9 Jun 2022 5:43 AM GMT
ట్రైలర్ టాక్: అవినీతిమయమైన రాజకీయ వ్యవస్థ పై గాడ్సే పోరాటం..!
X
విభిన్నమైన చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్నాడు వర్సటైల్ హీరో సత్యదేవ్. ప్రస్తుతం పలు ఆసక్తికరమైన ప్రాజెక్ట్స్ లో భాగమైన టాలెంటెడ్ యాక్టర్.. ఇప్పుడు "గాడ్సే'' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

గోపీ గణేష్ పట్టాభి దర్శకత్వంలో 'గాడ్సే' సినిమా తెరకెక్కింది. సీకే స్క్రీన్స్ బ్యానర్ పై సి. కల్యాణ్ అత్యంత భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో సత్యదేవ్ సరసన ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్ కు రెడీ అయింది. ఈ నేపథ్యంలో మేకర్స్ జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నారు.

'బ్లాఫ్ మాస్టర్' తర్వాత దర్శకుడు గోపీ గణేష్ పట్టాభి - సత్యదేవ్ కలయికలో వస్తోన్న ''గాడ్సే'' సినిమాపై అందరిలో ఆసక్తి నెలకొంది. టైటిల్ తోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో తాజాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ట్రైలర్ ను లాంచ్ చేసి చిత్ర బృందానికి విషెస్ అందజేశారు.

'సత్యమేవ జయతే అంటారు.. ధర్మో రక్షతి రక్షతః అంటారు.. కానీ సమాజంలో సత్యం ధర్మం ఎప్పుడూ స్వయంగా గెలవట్లేదు' అని సత్యదేవ్ ఇంటెన్స్ గా చెప్పే డైలాగ్ తో ఈ ట్రైలర్ ప్రారంభమవుతుంది. ప్రస్తుతం పొలిటికల్ సిస్టమ్ ను రాజకీయ నాయకులను టార్గెట్ చేస్తూ ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామాని రూపొందినట్లు ట్రైలర్ ని బట్టి తెలుస్తుంది.

అవినీతిమయమైన రాజకీయ నాయకులు మరియు మొత్తం ఈ వ్యవస్థ పై తిరుగుబాటు చేసిన యువకుడిగా సత్యదేవ్ కనిపించారు. అతన్ని పట్టుకోడానికి ప్రయత్నించే ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా ఐశ్వర్య లక్ష్మి కనిపించింది. సత్యదేవ్ - గోపి గణేష్ కలిసి మరోసారి హార్డ్ హిట్టింగ్ కంటెంట్ తో రాబోతున్నారని ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది.

'అర్హత ఉన్నోడే అసెంబ్లీలో ఉండాలి.. పద్ధతి ఉన్నోడే పార్లమెంట్ లో ఉండాలి.. మర్యాద ఉన్నోడే మేయర్ కావాలి.. సభ్యత ఉన్నోడే సర్పంచ్ కావాలి' అని సత్యదేవ్ చెప్పే పవర్ ఫుల్ డైలాగ్ ఆకట్టుకుంటోంది. అసలు ఈ గాడ్సే ఎవరు? ఈ వ్యవస్థ పై పొలిటికల్ లీడర్స్ పై ఫైట్ చేయడానికి కారణమేంటి? అతని కథ చివరకు ఎలా ముగిసింది? అనేది తెలియాలంటే సినిమా విడుదలయ్యే వరకు ఆగాల్సిందే.

సత్యదేవ్ లుక్ మరియు యాక్టింగ్ ఇందులో హైలైట్ గా నిలిచాయి. ఈ యాక్షన్ ప్యాక్డ్ ట్రైలర్ కు శాండీ అద్దంకి సమకూర్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఉత్కంఠకు గురి చేస్తుంది. సురేష్ సారంగం సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి. దీనికి బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేయగా.. సాగర్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు.

ఈ చిత్రంలో జియా శర్మ - సుజ్జు మీనన్ - బ్రహ్మాజీ - నాజర్ - సాయాజీ షిండే - కిషోర్ - ఆదిత్య మీనన్ - నాగబాబు - పృథ్వీరాజ్ - తనికెళ్ళ భరణి - ప్రియదర్శి - చైతన్య కృష్ణ - నోయల్ - గురు చరణ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ట్రైలర్ తో అంచనాలు పెంచేసిన ''గాడ్సే'' చిత్రాన్ని జూన్ 17న భారీ స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.