Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్ : గోవింద కామెడీ థ్రిల్లర్ ఆకట్టుకునేలా ఉంది!

By:  Tupaki Desk   |   13 Dec 2022 10:14 AM GMT
ట్రైలర్ టాక్ : గోవింద కామెడీ థ్రిల్లర్ ఆకట్టుకునేలా ఉంది!
X
బాలీవుడ్‌ యంగ్‌ స్టార్‌ హీరో విక్కీ కౌశల్‌ హీరోగా కియారా అద్వానీ మరియు భూమి పెడ్నెకర్‌ హీరోయిన్స్ గా నటించిన గోవింద నామ్ మేరా డైరెక్ట్‌ ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. భారీ ఎత్తున అంచనాలున్న ఈ సినిమా థియేట్రికల్‌ రిలీజ్ స్కిప్ చేయడంతో విక్కీ కౌశల్‌ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

డిసెంబర్‌ 16వ తారీకున డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్‌ లో స్ట్రీమింగ్ అవ్వబోతున్న గోవింద నామ్ మేరా సినిమా యొక్క ట్రైలర్‌ రెండు వారాల క్రితమే విడుదల అయ్యింది. ఇప్పుడు రిలీజ్ ముందు ప్రీ రిలీజ్ ట్రైలర్ అంటూ మరో ట్రైలర్‌ ను యూట్యూబ్‌ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చి సినిమాపై ఆసక్తిని పెంచారు.

గోవింద నామ్‌ మేరా లో విక్కీ కౌశల్‌ మరియు భూమి పెడ్నెకర్‌ భార్య భర్తలుగా కనిపించబోతున్నారు. అయితే కియారా అద్వానీతో విక్కీ ప్రేమలో పడటం ఆ తర్వాత జరిగే పరిణామాలను సరదాగా చూపించినట్లుగా ట్రైలర్‌ ను చూస్తూ ఉంటే అనిపిస్తుంది.

ఈ కథలో డ్రగ్స్ దందాను కూడా జత కలిపి మరింత వినోదాన్ని పంచుతూ థ్రిల్‌ చేసేలా మేకర్స్ ప్లాన్ చేసినట్లుగా అనిపిస్తుంది.

ఇప్పటికే విడుదల అయిన ట్రైలర్‌ తో పాటు తాజా ప్రీ రిలీజ్ ట్రైలర్ ను చూస్తూ ఉంటే సినిమా పూర్తి స్థాయి కామెడీ థ్రిల్లర్ గా ఉండబోతుందని తెలుస్తోంది. ఇలాంటి ఒక మంచి ఎంటర్‌ టైన్‌మెంట్ ని అందించే సినిమా ఓటీటీ ద్వారా కాకుండా థియేట్రికల్‌ రిలీజ్ అయ్యి ఉంటే బాగుండేది కదా అంటూ కొందరు ట్రైలర్ చూసిన తర్వాత అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఈ మధ్య కాలంలో బాలీవుడ్‌ లో విడుదల అవుతున్న సినిమాలు థియేటర్‌ లో సందడి చేయలేక పోతున్నాయి. అందుకే తప్పని పరిస్థితుల్లో ఇలా ఓటీటీ లో స్ట్రీమింగ్‌ కు సిద్ధం అవ్వాల్సి వచ్చింది అన్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో చెబుతున్నారు. ఓటీటీ లో అయినా తప్పకుండా ఈ సినిమా ఆకట్టుకుంటుందని.. మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందని అంతా నమ్ముతున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.