Begin typing your search above and press return to search.

ట్రైల‌ర్ టాక్: అయ్య‌ప్ప స్వామి ద‌ర్శ‌న మార్గంలో కొంద‌రుంటారు!

By:  Tupaki Desk   |   19 Jan 2023 3:40 PM GMT
ట్రైల‌ర్ టాక్: అయ్య‌ప్ప స్వామి ద‌ర్శ‌న మార్గంలో కొంద‌రుంటారు!
X
స్త్రీల‌కు శ‌భ‌రిమ‌ల ఆల‌యంలో ప్ర‌వేశం నిషేధం అనే బ‌ర్నింగ్ టాపిక్ ని ట‌చ్ చేస్తూ దేవుడి వెన‌క దుష్టుల క‌థ‌ను చెప్పే ప్ర‌య‌త్నం చేస్తున్నారా? అంటే అవున‌నే 'మాలికాపురం' ట్రైల‌ర్ చెబుతోంది. స్కూలుకు వెళ్లే ఒక బాలిక అయ్య‌ప్ప ద‌ర్శ‌నం చేసుకోవాల‌ని త‌పిస్తుంది. అంత‌లోనే త‌న‌ను ఒక మార్గ‌ద‌ర్శ‌కుడైన అయ్య‌ప్ప‌ భ‌క్తుడు క‌లుస్తాడు. అత‌డే క‌థానాయ‌కుడు ఉన్నిముకుంద‌న్. అత‌డు స్వామి ధీక్ష‌లో ఉంటూనే బాలిక‌ను శ‌బ‌రిమ‌ల‌ తీసుకుని వెళ‌తాడు.

అయితే మార్గ‌మ‌ధ్యంలో అడ‌వుల్లో ఏం జ‌రిగింద‌నే క‌థాంశాన్ని తెర‌పైకి తెచ్చారు. అయ్య‌ప్ప మార్గంలో దుష్ట‌శ‌క్తుల క‌థ‌ను త‌వ్వి తీస్తున్నార‌ని ఈ ట్రైల‌ర్ చెబుతోంది. అయ్య‌ప్ప ద‌ర్శ‌నానికి వెళ్లే దారిలో ద‌ట్ట‌మైన అడ‌వులే కాదు అక్క‌డ కొంద‌రు మ‌నుషులుంటారు! అనే డైలాగ్ తో అస‌లు థీమ్ లోకి వెళ్లారు.

ఇది క్యూరియాసిటీని పెంచే ఎలిమెంట్. ఇక బాలిక‌కు శ‌బ‌రిమ‌ల వెళ్లేందుకు స‌హాయ‌ప‌డే బాలుడి క‌థ కూడా ఆస‌క్తిని క‌లిగించింది. ఒక బ‌ర్నింగ్ ఇష్యూని తీసుకుని క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌ను జోడించి తెరపై ఆవిష్క‌రించిన ఈ సినిమా మ‌ల‌యాళంలో విడుద‌లైంది. ఇప్పుడు తెలుగు అనువాదం విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. తాజాగా రిలీజైన తెలుగు ట్రైల‌ర్ ఆద్యంతం ఆక‌ట్టుకుంది.

'షెఫీక్కింటే సంతోషం' అనే సినిమాలో నటించిన తర్వాత ఉన్ని ముకుందన్ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. అత‌డు దర్శకుడు విష్ణు శశి శంకర్ తో 'మలికప్పురం' (మ‌ల‌యాళం)లో న‌టించాడు. నూతన దర్శకుడు విష్ణు శశి శంకర్ దర్శకత్వం వహించిన మలికప్పురం చిత్రానికి పంతం వలవు ఫేమ్ అభిలాష్ పిళ్లై ర‌చ‌యిత‌. ఈ చిత్రం కొన్ని ఫాంటసీ అంశాలతో కూడిన ఫ్యామిలీ డ్రామా అలాగే కిడ్స్ మూవీ అని కూడా ప్ర‌చారం ఉంది.

ఉన్ని ముకుందన్ తో పాటు ఇందులో ఇంద్రన్స్- మనోజ్ కె జయన్- ఆల్ఫీ పంజికరణ్- సైజు కురుప్- రమేష్ పిషారోడి -సంపత్ రామ్ లతో పాటు బాల నటులు దేవానంద - శ్రీపత్ ప్రధాన పాత్రలు పోషించారు. రంజిన్ రాజ్ సంగీతం సమకూర్చగా.. మలికప్పురం సినిమాటోగ్రఫీని విష్ణు నారాయణన్ అందించారు.

ఈ సినిమా మ‌ల‌యాళ వెర్ష‌న్ శబరిమల యాత్రికుల సీజన్ లో విడుదల కావడం శుభపరిణామం కాగా అయ్య‌ప్ప భ‌క్తుల‌కు ఆస‌క్తిని క‌లిగించేదిగా ఉంద‌ని ట్రైల‌ర్ చెబుతోంది. కోట్లాది మంది అయ్యప్ప భక్తులకు మాలికాపురం ట్రీట్ గా నిలుస్తుంద‌నే ఆశిద్దాం. జ‌న‌వ‌రి 26న తెలుగు వెర్ష‌న్ ని గీతా ఆర్ట్స్ ఫిలిం డిస్ట్రిబ్యూష‌న్ అండ‌తో విడుద‌ల చేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.