Begin typing your search above and press return to search.
ట్రైలర్ టాక్ : ఇంట్రస్టింగ్ వినోదాల 'రైటర్ పద్మభూషణ్'
By: Tupaki Desk | 20 Jan 2023 10:35 AM GMTసుహాస్.. టీనా శిల్పరాజ్ జంటగా షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వంలో రూపొందిన రైటర్ పద్మభూషణ్ ఫిబ్రవరి 3వ తారీకున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సుహాస్ గత చిత్రం కలర్ ఫొటోతో పాటు ఆయన కీలక పాత్రల్లో నటించిన హిట్ 2 ఇంకా ఇతర సినిమాలు మంచి విజయాలను సొంతం చేసుకున్న నేపథ్యంలో రైటర్ పద్మభూషణ్ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి.
ఇప్పటికే విడుదల అయిన పోస్టర్స్.. టీజర్ మరియు పాటలు సినిమాపై ఆసక్తిని పెంచాయి అనడంలో సందేహం లేదు. ఇప్పుడు సినిమా యొక్క ట్రైలర్ అంచనాలను మరింతగా పెంచేలా ఉంది. ట్రైలర్ లో సినిమా ఎలా ఉండబోతుంది అనేది ఫుల్ క్లీయర్ గా చూపించారు.
ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందిన హీరో పెద్ద రచయిత అవ్వాలని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఆ క్రమంలో ఆయన యొక్క కుటుంబ పరిస్థితులు అతడి యొక్క కలకు ఎలా అడ్డం పడ్డాయి.. అదే సమయంలో హీరో యొక్క ప్రేమ కథలో వచ్చే ట్విస్ట్ లతో కథ సాగుతుంది.
ఒక బుక్ రాసి ఆ బుక్ ను సేల్ చేసేందుకు.. ఆ బుక్ ను రీడర్స్ తో చదివించేందుకు పడరాని పాట్లు పడుతూ ఉండే హీరో పాత్ర చాలా ఫన్నీగా ఉంది. అదే సమయంలో హీరోయిన్ నువ్వు రచయితవి కాదా అంటూ చెప్పిన డైలాగ్ సినిమాపై ఇంట్రస్ట్ కలిగేలా చేసింది.
మొత్తానికి ట్రైలర్ చూసిన తర్వాత రైటర్ పద్మభూషన్ ను థియేటర్ లో చూడాల్సిందే అన్నట్లుగా ఉంది. వినోదాన్ని పంచడంతో పాటు చాలా ఆసక్తికరంగా స్క్రీన్ ప్లే సాగినట్లుగా ట్రైలర్ తో మేకర్స్ చెప్పకనే చెప్పారు. ట్రైలర్ కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో ఫిబ్రవరి 3న విడుదల అయిన సమయంలో మంచి ఓపెనింగ్స్ కూడా దక్కే అవకాశం ఉంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.