Begin typing your search above and press return to search.
ట్రైలర్ టాక్: పానిపట్ యుద్ధంలో ఊచకోత
By: Tupaki Desk | 5 Nov 2019 9:19 AM GMTమొదటి పానిపట్టు యుద్ధం ఎప్పుడు జరిగింది? రెండో పానిపట్టు యుద్ధం ఎప్పుడు జరిగింది? అంటూ సోషల్ పుస్తకాల్లో చరిత్రను బట్టీ కొట్టిన రోజుల్ని మర్చిపోలేం. ఇప్పుడు ఆ పానిపట్టు యుద్ధాన్నే భారీ పాన్ ఇండియా సినిమాగా తీస్తుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. పాన్ ఇండియా కేటగిరీలో హిస్టారికల్ చిత్రాల బాలీవుడ్ దర్శకుడు అశుతోష్ గోవారికర్ చేస్తున్న ప్రయత్నమిది. సంజయ్ దత్-అర్జున్ కపూర్-కృతి సనోన్ వంటి స్టార్లు నటిస్తున్నారు. ఇటీవలే సంజయ్ దత్ - అర్జున్ కపూర్- కృతి వంటి స్టార్ల లుక్ ని రివీల్ చేశారు. దానికి చక్కని స్పందన వచ్చింది.
తాజాగా పానిపట్ (పానిపట్టు-తెలుగు) ట్రైలర్ రిలీజైంది. ఈ ట్రైలర్ ఆద్యంతం నాటి చరిత్ర స్పష్టంగా కనిపిస్తోంది. ఓ ప్రదేశం గురించి రాజుల మధ్య కొట్లాట ఈ సినిమా. తన మరాఠా రాజ్యాన్ని కాపాడుకునేందుకునేందుకు తన ప్రాంతం నుంచి చిల్లిగవ్వ కూడా ఎత్తుకెళ్లలేరు అంటూ మరాఠా యోధుడైన రాజు అర్జున్ కపూర్ చెబుతున్న డైలాగ్ ని బట్టి ఇందులో కథానాయకుడు అతడేనని అర్థమవుతోంది. ఇక ఆ రాజ్యాన్ని కైవశం చేసుకోవాలని తపించే ఆఫ్ఘనిస్తాన్ క్రూర రాజుగా సంజయ్ దత్ కనిపిస్తున్నారు. మధ్యలో వీరనారిగా కృతి కరవాలం తిప్పుతూ శత్రువుల్ని చీల్చి చెండాడుతోంది. అర్జున్ -కృతి మధ్య రోమాంచితమైన సన్నివేశం ఆకట్టుకుంది. మొత్తానికి చరిత్రలో దాగిన సత్యాన్ని అశుతోష్ అద్భుతంగా వెండితెరపై ఆవిష్కరించబోతున్నారని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.
ఓ మారు ఫ్లాష్ బ్యాక్ లోకి వెళితే ... 1526- 1556- 1761 లో జరిగిన ఉత్తరభారతదేశ చరిత్రలో మూడు ముఖ్యమైన పానిపట్టు యుద్ధాల కథ ఆసక్తికరం. మొదటి యుద్ధం భారతదేశంలో మొఘలాయిల పరిపాలనకు నాంది పలకగా.. రెండవ యుద్ధం మొఘలుల పట్టు నిలుపుకొనేందుకు.. మూడవ యుద్ధం వారి పాలనకు అంతమయ్యేందుకు కారణమయ్యాయి. మొదటి పానిపట్టు యుద్ధంలో 21 ఏప్రిల్ 1526 న మొఘలుల నాయకుడైన బాబర్ కూ.. అప్పటి కాబూల్ పరిపాలకుడైన సుల్తాన్ ఇబ్రాహీం లోడీకి మధ్య జరిగింది. సుల్తాన్ సైన్యం మొఘలాయిల సైన్యం కన్నా చాలా పెద్దది. కానీ అందరూ ఒక్కసారిగా పాల్గొనకుండా విడివిడిగా పాల్గొన్నారు. ఈ యుద్ధంలో ఇబ్రహీం లోడీ మరణించాడు. అతని సైన్యం సులభంగా ఓడిపోయింది. భారతదేశంలో మొఘలుల పరిపాలనకు ఇదే నాంది. రెండవ పానిపట్టు యుద్ధం 5 నవంబర్ 1556లో మొఘల్ వారసుడైన అక్బర్ సంరక్షుడిగా ఉన్న బైరం ఖాన్ కు.. ఆఫ్ఘనిస్థాన్కు చెందిన హిందూ సైన్యాధ్యక్షుడు హేముకు మధ్య జరిగింది. ఇందులో విజయం బైరం ఖాన్ ను వరించింది. దీంతో మొఘలులు అధికారంపై తమ పట్టు నిలుపుకొన్నట్లైంది. ఆప్ఘను సైన్యాధికారి అయిన అహ్మద్ షా అబ్దాలి మరియు మహారాష్ట్రలకు మధ్య మూడో పానిపట్టు యుద్ధం జరిగిందని చరిత్ర చెబుతోంది. ఇలాంటి గొప్ప చరిత్రపై విజువల్ గ్రాండియర్ సినిమాలు తీసే ప్రయత్నం జరుగుతోంది. లగాన్ - స్వదేశ్- జోదా అక్భర్ వంటి భారీ చిత్రాలు తీసిన అశుతోష్ సాహసవంతమైన ప్రయత్నమిది. విజన్ వరల్డ్-రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తాజా చిత్రానికి ప్రాజదరణ ఎలా ఉండనుంది? అన్నది చూడాలి.