Begin typing your search above and press return to search.
ట్రైలర్ టాక్: మమ్మీ అయ్యాక కబడ్డీ చాంపియన్
By: Tupaki Desk | 23 Dec 2019 5:37 PM GMTప్రేమ.. కామెడీ.. సెంటిమెంట్.. కుటుంబ బాధ్యత.. క్రీడా స్ఫూర్తి .. ఇన్ని విషయాలు ఒకే సినిమాలో చూపిస్తే అది `పంగ`. ఇందులో జయ నిగమ్ అనే జాతీయ స్థాయి కబడ్డీ చాంపియన్ గా కంగన రనౌత్ నటిస్తోంది. బరేలీకి బర్ఫీ ఫేం అశ్వని అయ్యర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. క్వీన్ కెరీర్ లో వరుసగా ప్రయోగాత్మక చిత్రాలతో వేడెక్కిస్తున్న టైమ్ లో కబడ్డీ నేపథ్యంలో ఆసక్తికర కథాంశంతో ప్రేక్షకాభిమానుల ముందుకు రాబోతోంది. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 24న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు.
తాజాగా రిలీజైన ట్రైలర్ లో జయ పాత్రలో కంగనను ఎలివేట్ చేశారు. జయ పరిచయం.. తన జీవితంలో లవ్.. ఎమోషన్.. కబడ్డీ ఆట ప్రాముఖ్యత ఇలా అన్ని కోణాల్ని ఆవిష్కరించారు. తన గమ్యంలో ఎదిగే దారికి అడ్డు వచ్చిన పరిస్థితిల్ని చూపించారు. ఒక జాతీయ స్థాయి కబడ్డీ చాంపియన్ పెళ్లి చేసుకుని ఒక బిడ్డకు తల్లి అయ్యి ఆటకు దూరమయ్యాక .. తిరిగి 32 వయసులో కబడ్డీలోకి ఎలా కంబ్యాక్ అయ్యింది? అన్నదే కథాంశం. అలా కంబ్యాక్ అయ్యాక చాంపియన్ అయ్యేందుకు ఏం చేసింది? అన్నది ఆసక్తికరం.
32 వయసులోనూ మమ్మీ అయ్యాక కబడ్డీ ఆటలో నిరూపించుకోలేరా? అనే ప్రశ్నను ట్రైలర్ లో వినిపించడం చూస్తుంటే ఒక మదర్ తన ఫ్యామిలీ లైఫ్ ని సజావుగా నడిపించేందుకు తను కన్న కలల్ని త్యాగం చేస్తుంది! అన్న థీమ్ ని ఎలివేట్ చేస్తున్నారు. మణికర్ణిక తర్వాత జడ్జిమెంటల్ హై క్యా లాంటి ప్రయోగంతో విజయం అందుకుంది. ఇటీవల వరుసగా ప్రయోగాలు చేస్తున్న కంగనకు ఇప్పుడు `పంగ` ఓ డిఫరెంట్ మూవీ అనే చెప్పాలి. అటుపైనా అమ్మ జయలలిత బయోపిక్ లో నటిస్తూ హీట్ పెంచేస్తోంది. అటుపై లేడీ ఆర్నాల్డ్ లా చెలరేగే ఓ భారీ యాక్షన్ చిత్రంలో నటించనుంది.