Begin typing your search above and press return to search.
ట్రెండీస్టోరీ: వెండి తెరపై స్పోర్స్ట్..బయోపిక్ వార్!
By: Tupaki Desk | 19 March 2022 3:30 AM GMTబయోపిక్ లు...స్పోర్స్ట్ బ్యాక్ డ్రాప్ చిత్రాలకు ఉండే క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఈ రెండు జానర్ చిత్రాలు ఎల్లప్పుడు ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తాయి. ఆ రెండింటికి అవినాభవ సంబంధం ఉంది. ఇప్పటికే వరకూ ఎంతో మంది క్రీడాకారుల జీవితాలు వెండి తెరకెక్కాయి. ప్రముఖ వ్యక్తుల జీవిత కథలకు స్టార్ మేకర్స్ దృశ్యరూపం ఇచ్చారు. వీటి సక్సెస్? ఫెయిల్యూర్స్ అనేది అందులో కంటెంట్ ని బట్టే అధారపడుతుంది. సబ్జెక్ట్ తో పాటు ఇలాంటి సినిమాలకు గ్రిప్పింగ్ స్క్కీన్ ప్లే..కథని డ్రమెటైజ్ చేసే విధానం వంటివి సక్సెస్ లో కీలక పాత్ర పోషిస్తుంటాయి.
ఇలాంటి కథల్ని అద్భుతంగా ఆవిష్కరించిన మేకర్స్ ఉన్నారు. వాటిని ప్లాప్స్ చేసిన మేకర్స్ ఉన్నారు. త్వరలో స్పోర్స్ట్ నేపథ్యంలో కొన్ని చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయుడిగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించిన 'గని' చిత్రం బాక్సింగ్ నేపథ్యంలోనే తెరకెక్కింది. ఇందులో వరుణ్ బాక్సర్ గా నటిస్తున్నాడు. ఈ పాత్ర కోసం వరుణ్ కొన్ని నెలలు పాటు బాక్సింగ్ ట్రైనింగ్ తీసుకున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన వరుణ్ బాక్సర్ లుక్ ఆద్యంత ఆకట్టుకుంటుంది. ప్రచార చిత్రాలకు మంచి ఆదరణ దక్కింది. భారీ అంచనాల మధ్య చిత్రాన్ని ఏప్రిల్ 8న పాన్ ఇండియా కేటగిరీలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఇక డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తెరకెక్కిస్తోన్న 'లైగర్' కూడా బాక్సింగ్ నేపథ్యం ఉన్న స్టోరీనే. ఇందులో విజయ్ దేవరకొండ బాక్సర్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ ని సైతం పూరి రంగంలోకి దించారు. దీన్ని బట్టి పూరి కాంపౌండ్ నుంచి వస్తోన్న డిఫరెంట్ సినిమా అని చెప్పొచ్చు. గతంలో బాక్సింగ్ నేపథ్యంలో 'అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి' చిత్రాన్ని రవితేజ హీరోగా తెరకెక్కించి పూరి సక్సెస్ కొట్టారు. ఇప్పుడు అదే సక్సెస్ ని రిపీట్ చేయాలని ఆశ పడుతున్నారు.
ఇక బాలీవుడ్ లో గ్రేట్ ఫుడ్ బాల్ కోచ్ సయ్యద్ అబ్ధుల్ రహీం బయోపిక్ని 'మైదాన్' టైటిల్ తో తెరకెక్కిస్తున్నారు. ఇందులో అజయ్ దేవగణ్ సయ్యద్ పాత్రలో కనిపించనున్నారు. అమిత్ శర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. జూన్ 3న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. టాలీవుడ్ లో హిట్ అయిన 'జెర్సీ' చిత్రాన్ని బాలీవుడ్ లో గౌతమ్ తిన్ననూరి రీమేక్ చేస్తున్నారు. నాని పోషించిన పాత్రని హిందీ రీమేక్ లో షాహిద్ కపూర్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే సినిమా రిలీజ్ కానుంది. ఫేమస్ రంజీ ప్లేయర్ కథని ఆవిష్కరించి తెలుగులో సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే.
ఇండియన్ ఉమెన్ క్రికెట్ లెజెండ్ మిథాలీ రాజ్ బయోపిక్ తెరకెక్కుతోంది. ఇందులో మిథాలీ పాత్రలో తాప్సీ నటిస్తుంది. ప్రస్తుతం సినిమా సెట్స్ లో ఉంది. ఇంకా ఇండియన్ క్రికెట్ టీమ్ మాజీ సారధి సౌరవ్ గంగూలీ బయోపిక్ కి రంగం సిద్దం అవుతుంది. ఇందులో రణవీర్ సింగ్ దాదా పాత్ర పోషిస్తున్నారు. 'దాదాగిరి' అనేది టైటిల్ అని సమాచారం. అలాగే మరో మాజీ ప్లేయర్ యువరాజ్ సింగ్ జీవిత కథని తెరపైకి తీసుకొచ్చే సన్నాహాలు జరుగుతున్నాయి.
ఇంకా ఫేమస్ షట్లర్ పి.వి సింధు బయోపిక్ ని సైతం సీన్ లోకి తీస్తున్నారు. సిందు పాత్రలో దీపికా పదుకొణే నటించడానికి సిద్దంగా ఉంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా గౌతమన్ తిన్ననూరి దర్శకత్వం లో తెరకెక్కనున్న చిత్రం కూడా క్రీడా నేపథ్యమున్న కథ అని సమాచారం. ఇంకా భవిష్యత్ లో మరిన్ని బయోపిక్లు..క్రీడా నేపథ్యమున్న చిత్రాలు రానున్నాయి. ఇలాంటి చిత్రాలకు ఓటీటీలోనూ మంచి డిమాండ్ ఉంటుంది. థియేటర్ రిలీజ్ కన్నా ఓటీటీ మంచి ఆఫర్లు ఇస్తుండటం విశేషం.