Begin typing your search above and press return to search.
ట్రెండీ స్టోరి: తమిళ మార్కెట్లో జెండా పాతేస్తారా?
By: Tupaki Desk | 28 March 2021 11:30 PM GMTపాన్ ఇండియా మార్కెట్ కేవలం రజనీకాంత్ - కమల్ హాసన్ వరకే పరిమితమా? అంటే కానేకాదని నిరూపణ అయ్యింది. బాహుబలి ఫ్రాంఛైజీతో ప్రభాస్ - రాజమౌళి బృందం అంతా మార్చేశారు. అద్భుతమైన కంటెంట్ .. విజువల్ గ్రాండియారిటీతో ప్రతిదీ మారుతుందని ప్రూవైంది. సరిగ్గా ఇదే ఎలిమెంట్ చాలామంది స్టార్ హీరోల్ని ఆలోచింపజేసింది. ఉత్తరాది- దక్షిణాది పరిశ్రమల్లో హీరోలంతా పాన్ ఇండియా మాయాజాలంలో పడిపోయారు.
ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలంతా ఇదే ఫీవర్ తో ఉన్నారు. ఇతర హీరోలతో పోలిస్తే ఇప్పుడు రామ్ చరణ్ .. బన్ని లాంటి హీరోల ప్లానింగ్ ఎంతో వైవిధ్యంగా ఉందనేది టాలీవుడ్ ఇన్ సైడ్ ప్రముఖులు సాగిస్తున్న విశ్లేషణ. బన్ని ఇప్పటికే హిందీ డబ్బింగులతో అక్కడా ప్రాచుర్యం పొందారు. కేరళ మార్కెట్లో చెప్పుకోదగ్గ హీరోగా రాణిస్తున్నాడు.
రామ్ చరణ్ ఇప్పటికే తమిళంలో మార్కెట్ ని విస్తరిస్తున్నారు. దర్శకుడు శంకర్ తో చెర్రీ పాన్ ఇండియా సినిమా తదుపరి సెన్సేషన్ గా మారనుందని అంచనా వేస్తున్నారు. ఇటు తెలుగు అటు హిందీతో పాటు తమిళ మార్కెట్లోనూ పాగా వేసేందుకు చరణ్ కి ఈ సినిమా ఎంతో సహకారిగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న పాన్-ఇండియా చిత్రం ఆర్.ఆర్.ఆర్ తోనే చెర్రీ క్రేజు ఇరుగు పొరుగు మార్కెట్లలో అమాంతం స్కైని టచ్ చేయనుంది. ఈ చిత్రం తమిళ వెర్షన్ లోనూ అత్యంత భారీగా విడుదలవుతోంది. తదుపరి వచ్చే శంకర్ మూవీ అంతకంటే భారీగా రిలీజవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈలోగానే రంగస్థలం అనువాదంతోనూ తమిళంలో వేడి పెంచే ప్లాన్ చేస్తుండడం ఆసక్తిని పెంచుతోంది.
మార్కెట్ అంటే ఏ కొందరికో పరిమితం కానే కాదు. తమిళ స్టార్ హీరోలతో పాటు తెలుగు హీరోలకు ..ఇరుగు పొరుగు మార్కెట్లలో నిరూపించుకునే సత్తా ఉందని నిరూపించాల్సిన టైమ్ వచ్చింది. రజనీ - కమల్ హాసన్ లను ఫాలో చేస్తూ ఆ తర్వాతి తరంలో వచ్చిన అజిత్- సూర్య- విక్రమ్ - కార్తీ పెద్ద స్తాయిలో నిరూపించుకున్నారు. ఇటీవల దళపతి విజయ్ కూడా తెలుగు మార్కెట్లో పరిధిని విస్తరిస్తున్నారు. అందుకే ఇప్పుడు మన స్టార్ హీరోలు కూడా తమిళ మార్కెట్లో సత్తా చాటాల్సిన టైమ్ వచ్చిందని తెలుగు పరిశ్రమ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.