Begin typing your search above and press return to search.
ట్రెండీ టాక్: OTTలో 2021 టాప్ 10 ఉచిత సినిమాలు
By: Tupaki Desk | 12 April 2021 11:30 PM GMTఈ సీజన్ లో బ్లాక్ బస్టర్ చిత్రంగా సంచలనం సృష్టించిన జాతి రత్నాలు ఏప్రిల్ 11 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. నవీన్ పోలిశెట్టి - రాహుల్ రవీంద్రన్- ప్రియదర్శి ప్రధాన తారాగణంగా నటించగా అనుదీప్ కేవి దర్శకత్వం వహించారు. నాగ్ అశ్విన్ నిర్మించారు. ఏప్రిల్ 14 నుంచి మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ నటించిన ఉప్పెన నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగుకి సిద్ధమవుతోంది. ఈ సినిమా వైష్ణవ్.. కృతి శెట్టి.. సుక్కూ శిష్యుడు బుచ్చిబాబు సనా (దర్శకుడు) కి తొలి పరిచయ చిత్రం అన్న సంగతి తెలిసిందే. మైత్రి సంస్థ నిర్మించిన ఉప్పెన బాక్సాఫీస్ వద్ద 100కోట్ల వసూళ్లతో సంచలనాలు సృష్టించింది.
క్రిటిక్స్ ప్రశంసలు అందుకుని బాక్సాఫీస్ వద్ద తిరస్కారానికి గురైన నాగార్జున వైల్డ్ డాగ్.. క్రిటిక్స్ విమర్శలతో పాటు ప్రేక్షకుల తిరస్కారానికి గురైన చావు కబురు చల్లగా కూడా త్వరలోనే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి.
కార్తికేయ- లావణ్య త్రిపాఠి నటించిన తొలి దర్శకుడు కౌశిక్ నటించిన `చావు కబురు చల్లగా` బాక్సాఫీస్ వద్ద విఫలమైంది. ఈ చిత్రం గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌లో అతిపెద్ద పరాజయంగా మిగిలింది. ఇది ఈ నెల 23 న AHA లో వస్తోంది. నాగార్జున వైల్డ్ డాగ్ కూడా త్వరలో (మే మూడోవారం) నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానుంది. ఎన్.ఐ.ఏ తీవ్రవాద ఆపరేషన్ నేపథ్యంలో ఈ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ కాగా ఓటీటీలో మెప్పిస్తుందన్న అంచనా ఏర్పడింది.
ఇక పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ వకీల్ సాబ్ థియేటర్లలో అద్భుత వసూళ్లను సాధిస్తోంది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కి 50 రోజులు పైగా పడుతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. జీ5లో వకీల్ సాబ్ స్ట్రీమింగ్ కానుంది.
ఇక రీసెంట్ ఫ్లాప్ చిత్రాల్లో రాజ్ తరుణ్ పవర్ ప్లే- రాజేంద్ర ప్రసాద్.. శ్రీవిష్ణు నటించిన `గాలి సంపత్` వంటి చిత్రాలు విడుదలైన కొద్ది వారాల్లోనే ఒటిటి ప్లాట్ ఫామ్‌ల లోకి విడుదలైన సంగతి తెలిసిందే.
వీటితో పాటు ఇరుగు పొరుగున రిలీజైన చిత్రాలు ఓటీటీలోకొస్తున్నాయి. మండేలా అనే తమిళ పొలిటికల్ సెటైర్ ఓటీటీలో రిలీజవుతోంది. అభిషేక్ బచ్చన్ నటించిన ది బిగ్ బుల్.. హలో చార్లీ అనే హిందీ చిత్రాలు ఓటీటీలో ఇటీవల రిలీజయ్యాయి. ఇక కన్నడలో కొన్ని వారాల క్రితం విడుదలైన యువరత్న ఓటీటీలోకి త్వరలోనే రిలీజ్ కానుంది.