Begin typing your search above and press return to search.

ట్రెండీ టాక్‌: గంగూభాయి .. సీత ఎవ‌రు బెస్ట్?

By:  Tupaki Desk   |   2 Feb 2022 2:30 PM GMT
ట్రెండీ టాక్‌: గంగూభాయి .. సీత ఎవ‌రు బెస్ట్?
X
బాలీవుడ్ నుంచి టాలీవుడ్ లో అడుగుపెడుతోంది ఆలియాభ‌ట్. హిందీ కెరీర్ ప‌రంగా క్ష‌ణం తీరిక లేనంత బిజీగా ఉన్న ఈ బ్యూటీని ఆర్.ఆర్.ఆర్ కోసం ఒప్పించేందుకు భారీ పారితోషికాన్ని ముట్ట‌జెప్పార‌ని ఇంత‌కుముందు క‌థనాలొచ్చాయి. దాదాపు 6-8కోట్ల మేర పారితోషికం అందుకుంద‌ని గుస‌గుస‌లు వినిపించాయి.

ఇక‌పోతే ఆలియా న‌టించిన రెండు క్రేజీ చిత్రాలు కేవ‌లం నెల‌రోజుల గ్యాప్ తో విడుద‌ల‌వుతుండ‌డం యాథృచ్ఛికం. ప్ర‌తిష్ఠాత్మ‌క ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ తేదీని ఇటీవ‌లే రాజ‌మౌళి బృందం అధికారికంగా ప్ర‌క‌టించింది. మార్చి 25న ఈ సినిమాని తెలుగు-హిందీ-త‌మిళం స‌హా ప‌లు భాష‌ల్లో విడుద‌ల చేస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు.

స‌రిగ్గా ఆర్.ఆర్.ఆర్ విడుద‌ల‌కు నెల‌రోజుల ముందే అంటే ఫిబ్ర‌వ‌రి 25న‌ గంగూభాయి క‌తియావాడీ రిలీజ‌వుతోంది. ఇందులో ఆలియా గంగూభాయిగా ప్ర‌యోగాత్మ‌క పాత్ర‌లో న‌టించింది. గ‌ట్సీ వేశ్యా గృహ నిర్వాహ‌కురాలుగా ఈ చిత్రంలో ఆలియా న‌ట‌న న‌భూతోన‌భ‌విష్య‌తి అన్న తీరుగా ఉంటుంద‌ని ప్ర‌చార‌మ‌వుతోంది. ఈ చిత్రానికి క‌ళాత్మ‌క చిత్రాల ద‌ర్శ‌కుడు సంజ‌య్ లీలా భ‌న్సాలీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డంతో ఉత్త‌రాదిన బోలెడంత హైప్ నెలకొంది. అయితే గంగూభాయి పాత్ర‌తో పోలిస్తే ఆర్.ఆర్.ఆర్ లో ఆలియా పాత్ర నిడివి చాలా చిన్న‌ది. త‌న రోల్ కేవ‌లం 20 నిమిషాలు మాత్ర‌మే ఉంటుంద‌ని ఇప్ప‌టికే క‌థ‌నాలొచ్చాయి. అయితే ఎంతో స్ఫూర్తిని నింపేదిగా ఈ పాత్రను రాజ‌మౌళి తీర్చిదిద్దారు. బ్రిటీష్ వారిపై విరోచితంగా పోరాడే అల్లూరి సీతారామ‌రాజు భార్య సీత‌గా ఆలియా న‌ట‌న తెలుగు వారికి న‌చ్చుతుంద‌ని ఇప్పటికే విడుద‌లైన ఆలియా లుక్ .. విజువ‌ల్స్ వెల్ల‌డించాయి. ఫిబ్ర‌వ‌రి 25.. మార్చి 25 తేదీలు ఆలియాకు చాలా ఇంపార్టెంట్. ఈ రెండు సినిమాల్లో త‌న కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ తో ర‌క్తి క‌ట్టిస్తాన‌నే న‌మ్మ‌కంతో ఉంది.

ఆలియా కెరీర్ లో ఎన్నో ఉత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న‌లు ఉన్నాయి. స్టూడెంట్ ఆఫ్ ది ఇయ‌ర్ తో తెరంగేట్రం చేసిన ఈ బ్యూటీ ఉత్త‌మ డెబ్యూ పుర‌స్కారాల్ని త‌న ఖాతాలో వేసుకుంది. అలాగే రాజీ చిత్రంలో న‌ట‌న‌కు ఫిలింఫేర్ ఉత్త‌మ న‌టి పుర‌స్కారం అందుకుంది. ఇప్పుడు గంగూభాయిగా మ‌రోసారి అవార్డులు రివార్డులు కొల్ల‌గొట్ట‌నుంద‌ని అంచ‌నా. ఆర్.ఆర్.ఆర్ లో సీత పాత్ర‌తో ఎంత‌గా ప్ర‌భావితం చేస్తుందో చూడాలి.