Begin typing your search above and press return to search.

ట్రెండీ టాక్: చుక్క‌ల్లో జాతిర‌త్నం పారితోషికం

By:  Tupaki Desk   |   11 April 2021 8:00 AM GMT
ట్రెండీ టాక్: చుక్క‌ల్లో జాతిర‌త్నం పారితోషికం
X
బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బ‌స్ట‌ర్ల‌తో స‌త్తా చాటాడు న‌వీన్ పోలిశెట్టి. తెలుగు యువ‌హీరోల్లో సిస‌లైన ప్ర‌తిభావంతుడైన‌ జాతిర‌త్నంగా అత‌డి పేరు మార్మోగుతోంది. ఏజెంట్ ఆత్రేయ‌గా.. జాతిర‌త్నంగా అత‌డు న‌టించిన తీరుకు క్రిటిక్స్ ప్రేక్ష‌కాభిమానులు హ్యాట్సాఫ్ చెప్పారు. ప్ర‌స్తుతం టాలీవుడ్ లో క్రేజీ యువ‌హీరోగా అత‌డి పేరు మార్మోగుతోంది.

దానికి త‌గ్గ‌ట్టే పారితోషికంలో అత‌డు చుక్క‌ల్లో చంద్రుడ‌య్యాడ‌న్న గుస‌గుసా తాజాగా స్ప్రెడ్ అయ్యింది. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ- జాతి రత్నలు చిత్రాలతో స‌త్తా చాటిన అత‌డు త‌దుప‌రి చిత్రానికి పెద్ద పారితోషికం అందుకుంటున్నాడ‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. చాలా మంది నిర్మాతలు నవీన్ కోసం భారీ పారితోషికం చెల్లించేందుకు అడ్వాన్సులు కూడా ఇవ్వాల‌ని చూస్తున్నార‌ట‌. దాదాపు 5 కోట్ల పారితోషికం ఇచ్చేందుకు ఒక నిర్మాత ఆఫ‌ర్ చేశార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. న‌వీన్ ప్ర‌తిభ స్టామినా పై గొప్ప న‌మ్మ‌కంతోనే ఇంత పెద్ద మొత్తం ఆఫ‌ర్ చేస్తున్నార‌ట‌.

న‌వీన్ న‌టించిన జాతిర‌త్నాలు బాక్సాఫీస్ వ‌ద్ద 65కోట్లు వ‌సూలు చేయ‌డ‌మే గాక అమెరికాలో మిలియ‌న్ డాల‌ర్ క్ల‌బ్ లో చేరింది. అందుకే ఇప్పుడు నిర్మాత‌లు అత‌డిని ఎంపిక చేసుకునేందుకు వెన‌కాడ‌డం లేద‌ట‌. కొంతమంది నిర్మాతలు నవీన్ సెల‌క్ష‌న్ .. ప్ర‌చార స్ట్రాట‌జీపైనా విప‌రీత‌మైన న‌మ్మ‌కంతో ఉన్నారు‌. ఎంతో తెలివైన‌ చమత్కారమైన వీడియోలతో సులువుగా ప్ర‌మోష‌న్ సాగించే హీరోగానూ అత‌డికి డిమాండ్ పెరిగింది‌. నవీన్ తో ఒప్పందం చేసుకుంటే..ప్రమోషన్ల కోసం అదనపు ఖ‌ర్చు పెట్టవలసిన అవసరం లేదని కూడా నిర్మాత‌లు భావిస్తున్నారట‌. ఇప్ప‌టికి నవీన్ ఏ చిత్రానికి సంతకం చేయలేదు. ప్ర‌స్తుతం స‌క్సెస్ ఆస్వాధ‌న‌లో భాగంగా న‌వీన్ వెకేష‌న్ కి వెళ్లార‌ని తెలిసింది.