Begin typing your search above and press return to search.
ట్రెండీ టాక్: పబ్లిసిటీలోనూ మత్తుగానే!
By: Tupaki Desk | 20 Dec 2019 9:44 AM GMTసోషల్ మీడియా ట్రెండ్ లో ప్రతిదానికి ఉచిత ప్రచారం కలిసొస్తోంది అన్న భావన పెరుగుతోంది. అయితే దాని పర్యవసానం బాక్సాఫీస్ వద్ద డైరెక్టుగా కనిపిస్తోంది. సోషల్ మీడియాలు పల్లెల వరకూ వెళ్లినా కానీ అది సినిమాలకు కాసులు రాల్చడానికి సరిపోవడం లేదు. ఇప్పుడున్న కాంపిటీషన్ లో అన్ని మీడియా మాధ్యమాల అవసరం కనిపిస్తోంది. అయితే టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.కీరవాణి తన వారసుల సినిమాకి చేస్తున్న ప్రచారం ఏ మేరకు రీచ్ అవుతోంది? అంటే ప్చ్! అని పెదవి విరిచేస్తున్నారు. డెబ్యూలకు ఇలాగేనా? ఈమాత్రం సరిపోతుందా? అన్న చర్చా ఫిలింనగర్ లో వేడెక్కిస్తోంది.
బాహుబలి రేంజ్ సంగీత దర్శకుడిగా కీరవాణికి జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న మాట నిజం. దర్శక ధీరుడు రాజమౌళి అన్నగా అందరికీ తెలుసు. అంతటి సంగీత దిగ్గజం వారసుల్లో ఒకరు హీరోగా ఇంకొకరు సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నా.. ఆ సినిమాకి పబ్లిసిటీ అంతంత మాత్రమేనని అర్థమవుతోంది. చిన్న కుమారుడు సింహా `మత్తు వదలరా` అనే సినిమాతో టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇస్తుంటే.. పెద్ద కుమారుడు కాలభైరవ ఇదే చిత్రంతో సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రితేష్ రానా అనే కొత్త కుర్రాడు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్- క్లాప్ ఎంటర్ టైన్ మెంట్స్ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ఈ సినిమా కోసం ఆర్.ఆర్.ఆర్ ని సైతం పక్కనబెట్టి రాజమౌళి రిస్క్ చేయడం ఇటీవల చర్చకొచ్చింది. మత్తు వదలరా టీమ్ కి ఎన్నో జాగ్రత్తలు చెప్పారాయన. టీజర్.. ట్రైలర్ ఆకట్టుకున్నా.. జనాల్లోకి తీసుకెళ్లడంలోనే టీమ్ వెనకబడింది. మరో వారంలోనే రిలీజ్ కి వస్తున్న ఈ చిత్రానికి తాజాగా సెన్సార్ యుఏ సర్టిఫికెట్ ఇచ్చింది. డెబ్యూ హీరోకి ఇప్పటికి చేసిన ప్రచారం సరిపోతుందా? అంటే సందేహం వ్యక్తమవుతోంది. ఈ సినిమా గురించి మీడియాకే తెలిసింది తక్కువ. ఇక ప్రజల్లోకి ఎలా వెళుతుంది? అన్న సందేహం వ్యక్తమవుతోంది. ప్రచారంపై ఇటు కీరవాణి కానీ.. అటు మైత్రీ మూవీ మేకర్స్ కానీ లైట్ తీసుకున్నట్లే అనిపిస్తోంది. అప్పుడప్పుడు సోషల్ మీడియా తప్ప వేరే పబ్లిసిటీ ఏదీ లేదు. వాస్తవానికి ఈ సినిమా ప్రారంభమైన దగ్గర నుంచి ఇదే తంతు నడుస్తోంది.
సినిమాకు సంబంధించిన ప‌్రీ రిలీజ్ లు.. కాస్టింగ్ ఇంటర్వూలు ఇలాంటివేమి లేకుండానే సినిమాని రిలీజ్ చేసేస్తున్నారా? అంటే అవుననే సందేహం వ్యక్తమవుతోంది. మరీ ఎందుకిలా చేస్తున్నారు? ప‌్రచారంపై ఎందుకీ విముఖత? అసలు ఈ మౌనం వెనక కారణం ఏమిటి? అంటూ ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. దీనిపై యూనిట్ స్పందిస్తే కానీ ఏ క్లారిటీ రాదు.