Begin typing your search above and press return to search.
ట్రెండీ టాక్: భళ్లా ఎవరా `పాత స్నేహితుడు`?
By: Tupaki Desk | 15 July 2021 4:43 AM GMT``వై సో స్కిన్నీ రానా?`` అంటూ జాతీయ మీడియాలు కథనాలు రాసాయి. ఇంతకీ రానాకి ఏమైంది? అసలు ఏమిటా అనారోగ్యం? అంటూ వ్యంగ్యాన్ని ప్రదర్శించారు కొందరైతే. రానా అమెరికాలో శస్త్ర చికిత్స చేయించుకునేందుకు వెళ్లారని తామరతంపరగా కథనాలొచ్చాయి. అయితే ఆ సమయానికి అతడి రూపం పూర్తిగా మారిపోయింది. బాగా సన్నబడ్డారు. మనిషి పీలగా కనిపించారు. అందుకు సంబంధించిన ఫోటోలు అంతర్జాలంలో వైరల్ అయ్యాయి. శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తి చేసుకుని అనంతరం మీడియాకి కనిపించినప్పుడు అతడు చాలా బక్కపలచగా కనిపించారు.
మన భళ్లాలుడేనా? అంటూ అభిమానులు షాక్ తిన్నారు. రానా రూపం అంతగా మారిపోవడానికి కారణమేమిటా? అంటూ ఆరాలు మొలయ్యాయి. మొత్తానికి అనారోగ్యం కారణంగా రానా కొంత ఇబ్బందిపడ్డారు అన్నది నిజం!
కానీ పట్టుదల ఉన్న చోట ఏదైనా సాధ్యమే. అతడు బాహుబలి చిత్రానికి ముందు కూడా సన్నగానే ఉన్నారు. లీడర్ లో డెబ్యూగా నటించేప్పుడు ఈ గడ కర్రలాంటి కుర్రాడు హీరోనా? అని చెణుకులు విసిరిన వారున్నారు. కానీ అన్నిటినీ అధిగమించి రానా తానేంటో చూపించారు. పట్టుదల కృషి ఉంటే సాధించలేనిది ఏదీ లేదని ప్రూవ్ చేశారు. బాహుబలి చిత్రంలో భళ్లాలదేవుడి పాత్ర కోసం జిమ్ముల్లో కఠినోపాసన చేసిన రానా భీకరాకారంతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఒక విధంగా ప్రభాస్ ని మించి భారీ శరీరాకృతిని చూపించి రానా షాకిచ్చాడు. అంతగా అతడు ఆ పాత్ర కోసం తపించాడు. కానీ అవన్నీ మాయమై అనారోగ్యం వల్ల ఆ స్థానంలో పీలకగా కనిపించేసరికి నెటిజనం అంతా సందేహాలు వ్యక్తం చేశారు.
అయితే పోగొట్టుకున్నది తిరిగి తేవడమెలానో రానాకు బాగా తెలుసు. తాజాగా రానా దగ్గుబాటి కొత్త పోస్ట్ అందరినీ షాక్ కి గురి చేస్తోంది. అతడు తిరిగి పాత రూపానికి షిఫ్టయ్యాడు. మరో భళ్లాలుడిలా కనిపిస్తున్నాడు. షోల్డర్ బైసెప్ ఈ పోస్టర్లో భీకరంగా కనిపిస్తున్నాయి. నరాలు పొంగి పైకొచ్చాయి. అందుకు తగ్గట్టే `పాత స్నేహితుడు` అని క్యాప్షన్ ఇవ్వడం ఆసక్తిని కలిగిస్తోంది. ``పాత స్నేహితుడికి తిరిగి స్వాగతం. WIP ``అనడంతో హీట్ పెరిగింది. పాత స్నేహితుడు అని పిలవమని కోరిన రానాకు రిప్లయ్ లు అంతే బావున్నాయి. ఈ ఫోటో అప్ లోడ్ అయిన కొద్ది గంటల్లోనే స్నేహితులు అభిమానుల అభినందనలతో రానా పోస్ట్ నిండిపోయింది. రానా ఇంత వేగంగా కంబ్యాక్ అవ్వడం చూస్తుంటే అతడి కృషి పట్టుదల ఏ రేంజులో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
ప్రస్తుతం రానా అరడజను భారీ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇందులో విరాటపర్వం రిలీజ్ కి రెడీ అవుతోంది. అయ్యప్పనుమ్ కోషియం రీమేక్ చిత్రీకరణ సాగుతోంది. హిరణ్యకశిప సహా పలు చిత్రాలకు సంబంధించిన కొత్త అప్ డేట్స్ తెలియాల్సి ఉంది. హిరణ్య కసిప పురాణేతిహాసానికి సంబంధించిన కథాంశంతో పాన్ ఇండియా కేటగిరీలో అత్యంత భారీగా తెరకెక్కనుంది. వీఎఫ్ ఎక్స్ కోసం భారీ బడ్జెట్ ని కేటాయించనున్నారు.