Begin typing your search above and press return to search.
ట్రెండీ టాక్: షాకిచ్చిన RRR విదేశీ హక్కులు
By: Tupaki Desk | 26 Jan 2021 4:30 AM GMTకరోనా మహమ్మారీ నెమ్మదిగా శాంతిస్తుండడం మార్కెట్ పై ఆశావహ ధృక్పథం పెంచుతోంది. నిన్నటి వరకూ ఉన్న పరిస్థితి నేడు లేదు. నేటి స్థితి రేపు ఉండదు. అందుకేనేమో.. ప్రతిష్ఠాత్మక పాన్ ఇండియా మూవీ ఆర్.ఆర్.ఆర్ బిజినెస్ కి హైప్ పెరిగింది.
ఎస్.ఎస్. రాజమౌళి విడుదల తేదీని ఖరారు చేయడంతో ప్రీ-రిలీజ్ బిజినెస్ కి ఒక్కసారిగా రెక్కలొచ్చాయని చెబుతున్నారు. 2020-21 సీజన్ మోస్ట్ అవైటెడ్ ఇండియన్ సినిమాగా ఆర్.ఆర్.ఆర్ గురించిన ఆసక్తి మార్కెట్ వర్గాల్లో ఉంది. అక్టోబర్ 13 న దసరా కానుకగా ఈ మూవీ రిలీజ్ కానుంది. పండగ ఫర్వదినాన్ని పురస్కరించుకుని రిలీజవుతోంది కాబట్టి ఆదరణ ఆ స్థాయిలోనే ఉంటుందని జక్కన్న అండ్ టీమ్ అంచనా వేస్తున్నారు. ట్రేడ్ కూడా దీనిని నమ్ముతోంది. తెలుగు రాష్ట్రాల సంగతి అటుంచితే విదేశాల్లో సన్నివేశమేమిటి? అన్నది ఆలోచిస్తే పలు ఆసక్తికర సంగతులే తెలిసాయి.
కరోనా క్రైసిస్ తో అమెరికా అల్లాడిపోతున్న వేళ టాలీవుడ్ కి మరో నైజాం అయిన అగ్ర రాజ్య మార్కెట్ ఏమవుతుందోనన్న ఆందోళన టాలీవుడ్ కి కునుకు పట్టనివ్వలేదు. కానీ ఇప్పుడు నెమ్మదిగా అక్కడా పరిస్థితులు చక్కబడుతున్నాయి. అమెరికాలో COVID రెండవ వేవ్ ఎక్కువ కాలం ఉండదు. అక్టోబర్ నాటికి పరిస్థితి అదుపులోకి వస్తుందన్న అంచనా ఉంది. అందుకే రాజమౌళి ధైర్యం చేసి సినిమా రిలీజ్ తేదీని ప్రకటించారు.
ఆయన రిలీజ్ తేదీ ప్రకటించిన మరుక్షణం అమెరికా రిలీజ్ హక్కులు అమ్ముడయ్యాయని తెలుస్తోంది. తెలుగు -తమిళ వెర్షన్ల విదేశీ హక్కులను ఫార్స్ ఫిల్మ్స్ కు 68 కోట్లకు విక్రయించారని తెలిసింది. ఇదే సంస్థ ఇంతకుముందు సాహో విదేశీ హక్కుల్ని ఛేజిక్కించుకున్న సంగతి తెలిసినదే.
బాహుబలి తర్వాత మళ్లీ అంతటి వేవ్ ఆర్.ఆర్.ఆర్ తో తేగలననే రాజమౌళి నమ్ముతున్నారు. రామ్ చరణ్ - రామారావు స్టామినాని ఆయన పూర్తిగా నమ్మి ముందుకెళుతున్నారు. మరి అంతిమ ఫలితం ఏమవుతుందో చూడాలి.