Begin typing your search above and press return to search.
ట్రెండీ టాక్: సమంతకు స్టార్ హీరో మద్ధతు
By: Tupaki Desk | 11 Jan 2023 4:02 AM GMTబిగ్ బి అమితాబ్ బచ్చన్ తన యుక్త వయసులో ట్యూబర్ క్లోసిస్ (టీబీ)తో బాధపడ్డారు. నరకయాతన అనుభవించానని ఆయనే స్వయంగా పబ్లిగ్గా చెప్పారు. ఆ తర్వాత కాలేయ సంబంధ వ్యాధులు ఆయనను చుట్టుముట్టాయి. టీబీ వల్ల 75 శాతం లివర్ పని చేయలేదని కూడా బహిరంగంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. కానీ మంచి అలవాట్లతో 80 వయసులోను ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు.
ఇప్పుడు సమంత మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతోంది. అయితే సామ్ కి ఇలాంటి కష్టం వచ్చిందని ఎవరూ కనికరించడం లేదు. జాలి దయ చూపించడం లేదు. చాలా మంది మానవులు సామాజిక మాధ్యమాల్లో అమానవీయంగా ప్రవర్తిస్తున్నారు. సామ్ అనారోగ్యాన్ని ఎత్తి చూపుతున్నారు. తన గ్లామర్ అంతా కోల్పోయిందని ఇక నటించలేదని కూడా అంటున్నారు. కానీ అన్నిటికీ ఒకటే సమాధానం. తన అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ ద్వారా మయోసైటిస్ పై అజేయమైన పోరాటం ద్వారా తన పునరారంగేట్రం ఘనంగా ఉంటుందని చాటుకుంటోంది.
సమంత నటించిన శాకుంతలం ట్రైలర్ 10 జనవరి 2023న (నిన్న) గ్రాండ్ గా విడుదల కాగా..ఈ ట్రైలర్ కి ప్రేక్షకుల నుండి అద్భుత స్పందన వస్తోంది. చాలా కాలం తర్వాత సామ్ ని పబ్లిక్ గా చూసేందుకు అభిమానులు థ్రిల్ అయ్యారు.
అయితే కొందరు ఇప్పటికీ సమంతను ట్రోల్ చేస్తూనే ఉన్నారు. సమంతలో మునుపటి ఆకర్షణ కనిపించలేదని.. గ్లో కోల్పోయిందని రాశారు. అయితే ఇలాంటి దురుద్ధేశ ట్రోలర్లకు సమంత దీటైన సమాధానం ఇచ్చింది. ఇప్పుడు బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ తనకు మద్దతుగా నిలిచాడు.
క్లిక్ బెయిట్ ల గురించి కొద్దిమంది మాత్రమే ఆలోచిస్తారని అలా నెగిటివ్ గా రాసే వారి పట్ల తనకు బాధగా ఉందని వరుణ్ ధావన్ అన్నాడు. ఈ ట్రోలర్ లకు గ్లో అవసరమైతే ఇన్ స్టాగ్రామ్ ఫిల్టర్ ల కోసం వెతకాలని వరుణ్ ధావన్ పేర్కొన్నాడు. సామ్ ఇటీవల అనారోగ్యంతో ఉన్నా మొక్కవోని ధీక్షతో అన్నిటినీ జయిస్తోంది. నటిగా తన అంకితభావం సంకల్పాన్ని ప్రదర్శిస్తోంది.
తదుపరి శాకుంతలం ప్రమోషన్లలో పాల్గొంటుంది. తనను విమర్శించిన నోళ్లను మూయించడానికి సిద్ధమవుతోంది. సిటాడెల్ ఇండియా వెర్షన్ లో వరుణ్ ధావన్ తో కలిసి సమంత నటించనుంది. మయోసైటిస్ వల్ల ఈ సిరీస్ నుంచి తప్పుకుందని సమంత గురించి ఉన్నవి లేనివి రాసారు. కానీ అవన్నీ నిజాలు కావని నిరూపణ అయ్యింది. సమంతకు తన సహచర నటుడు వరుణ్ ధావన్ నుంచి నిర్మాతలు రాజ్ అండ్ డీకే నుంచి పూర్తి మద్ధతు ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.