Begin typing your search above and press return to search.
ఒక హౌస్.. అందులో రెండు జంటలు.. ఒకటైతే ట్రయాంగిల్ లవ్ స్టోరీ?
By: Tupaki Desk | 24 Sep 2022 4:13 AM GMTబిగ్ బాస్ సీజన్ 6 షురూ అయి దగ్గర దగ్గర నెల రోజులకు (కరెక్టుగా చెప్పాలంటే మూడు వారాల్ని దాటేసింది) వచ్చేస్తోంది. అయినా ఒక గాడిన పడినట్లుగా కనిపించట్లేదు. సాధారణంగా బిగ్ బాస్ సీజన్ మొదలైన తర్వాత మొదట్లో కాస్తంత చప్పగా ఉన్నా.. రోజులు గడుస్తున్న కొద్దీ.. ఆసక్తి అంతకంతకూ పెరుగుతూ ఉంటుంది. తాజా సీజన్ లో ఇంకా ఆ దశకు చేరుకోలేదన్న మాట వినిపిస్తోంది.
ఎప్పటిలానే.. తాజా సీజన్ 6లోనూ హౌస్ లోని సభ్యుల మధ్య లవ్ ట్రాక్ నడుస్తోంది. సీజన్ 3లో రాహుల్ సిప్లిగంజ్ - పునర్నవి భూపాలం జోడీ సెట్ కావటం.. ఆ తర్వాతి సీజన్ లో అఖిల్ కార్తీక్ - మోనాల్ కు ట్రాక్ సెట్ కావటం తెలిసిందే.
సీజన్ ఏదైనా.. హౌస్ మేట్స్ మధ్య లవ్ ట్రాక్ నడవటం మామూలే. వారి లవ్ ఇష్యూ హాట్ టాపిక్ గా మారటం తెలిసిందే. సీజన్ 5లో సిరి - షన్ను మధ్య క్యూట్ ఫ్రెండ్ షిప్ నుంచి ఇద్దరి మధ్య హాట్ హగ్గులు ఆ సీజన్ లో ఎంతటి చర్చకు కారణమైందన్న సంగతి తెలిసిందే. హౌస్ బయట ఇద్దరికి వేర్వేరుగా లవ్ ట్రాకులు ఉండటం.. ఇంట్లో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ముదిరిపాకాన పడటమే కాదు..సిరి తల్లి హౌస్ లోనే కుమార్తె తీరును తప్పు పట్టటం ఆ సీజన్ లో చూసిందే.
తాజా సిరీస్ విషయానికి వస్తే.. ఈసారి హౌస్ లో రెండు లవ్ ట్రాకులు నడుస్తున్నాయి. అందులో ఒకటి సూర్య - ఆరోహి అయితే.. రెండోది అర్జున్ - శ్రీసత్య. కాకుంటే.. రెండో లవ్ ట్రాక్ ట్రయాంగిల్ లవ్ స్టోరీగా నిలవటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. శ్రీ సత్యతో కాకుండా వాసంతితోనూ అర్జున్ అలాంటి బిహేవియర్ తో ఉన్నట్లుగా హౌస్ మేట్స్ మాట్లాడుకోవటం గమనార్హం. ఈ లవ్ ట్రాక్ గురించి శ్రీహాన్ - నేహాలు మాట్లాడుకున్న సన్నివేశాలు తాజా ఎపిసోడ్ లో టెలికాస్ట్ అయ్యాయి.
అర్జున్ కు శ్రీసత్య మీద ఏదో ఫీలింగ్ ఉందని.. కానీ ఆమెను అర్జున్ పట్టించుకోవటం లేదని శ్రీహాన్ అంటే.. 'వాసంతి విషయంలోనూ అర్జున్ అలానే బిహేవ్ చేస్తున్నాడుగా' అంటూ నేహా కామెంట్ చేయటం కనిపిస్తుంటుంది. నేహా మాటలకు శ్రీహాన్ సైతం.. 'అవును.. నాకూ అలానే అనిపిస్తోంది' అనగా.. దానికి స్పందనగా నేహా.. 'ఏంటి ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తోందా?' అని వ్యాఖ్యానించటం గమనార్హం.
హౌస్ లో ఆట ఆడటానికి ఇలా చేస్తున్నారా? నిజంగానే ఇద్దరి మధ్య ఏమైనా ఉందా? అన్నది తెలీటం లేదంటూ నేహా పెట్టిన మెలికతో.. ఇష్యూను మరింత జాగ్రత్తగా చూడాలన్న భావనకు కలిగేలా ఉన్నాయని చెప్పాలి. ఏమైనా.. ఇప్పటివరకు లవ్ ట్రాకులు ఇంకా షురూ కాలేదన్న కొరత తీరుస్తూ.. కొత్త సీజన్ లో ఒకటి కాదు రెండు లవ్ స్టోరీస్ అన్నట్లుగా మారిన బిగ్ బాస్ 6లో మరెన్ని సిత్రాలు దర్శనమిస్తాయో?
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.