Begin typing your search above and press return to search.

విశాల్ సినిమా రిలీజ్ ఆపాలంటూ హైకోర్టు ఉత్త‌ర్వు

By:  Tupaki Desk   |   23 Sep 2020 1:30 AM GMT
విశాల్ సినిమా రిలీజ్ ఆపాలంటూ హైకోర్టు ఉత్త‌ర్వు
X
త‌మిళ హీరో విశాల్ మ‌రోసారి లీగ‌ల్ వివాదంలో చిక్కుకున్నారు. ఆయ‌న న‌టిస్తున్న తాజా చిత్రం విడుద‌ల‌ను నిలిపివేయాలంటూ మ‌ద్రాస్ హైకోర్టు మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు జారీ చేసింది. ద‌ర్శ‌కుడు ఎం.ఎస్ ఆనంద‌న్ ద‌ర్శ‌క‌త్వంలో విశాల్ న‌టించి నిర్మించిన చిత్రం `చ‌క్ర‌`. సైబ‌ర్ క్రైమ్ నేప‌థ్యంలో `అభిమ‌న్యుడు` చిత్రానికి సీక్వెల్ ‌గా రూపొందిన ఈ మూవీ రిలీజ్ ప్ర‌శ్నార్థ‌కంలో ప‌డిపోయింది. శ్ర‌ద్ధా శ్రీ‌నాథ్‌.. రెజీనా క‌సాండ్రా హీరోయిన్ లుగా న‌టించిన ఈ చిత్రాన్ని దీపావ‌ళికి ఓటీటీలో రిలీజ్ చేయాల‌ని
ప్లాన్ చేశారు.

ఈ మూవీ విడుద‌లను నిలిపివేయాలంటూ ట్రిడెంట్ ఆర్ట్స్ సంస్థ మ‌ద్రాస్ హైకోర్టులో పిటీష‌న్ దాఖ‌లు చేసింది. విశాల్ న‌టించిన `యాక్ష‌న్‌` చిత్రానికి తాము పెట్టిన పెట్టుబ‌డిని తిరిగి చెల్లించే వ‌ర‌కు ఈ చిత్ర రిలీజ్‌ని నిలిపివేయాలంటూ కోర్టుని కోరింది. దీంతో విచార‌ణ చేప‌ట్టిన ధ‌ర్మాస‌నం విశాల్ న‌టించిన `చ‌క్ర‌` చిత్ర రిలీజ్ ని నిలిపి వేస్తూ సంచ‌ల‌న తీర్పునిచ్చింది. `యాక్ష‌న్` చిత్రానికి 44 కోట్లు బ‌డ్జెట్ అయింది. అయితే ఆ అనుకున్న స్థాయిలో ఈ మూవీ క‌లెక్ట్ చేయ‌లేక‌పోయింది. 20 కోట్లకు పూచీగా వున్న విశాల్ త‌న త‌దుప‌రి చిత్ర‌మైన `చ‌క్ర`ని ఇదే సంస్థ‌కు చేస్తాన‌ని మాటిచ్చార‌ట‌.

అయితే ఆ మాట‌ని త‌ప్పి సొంత బ్యాన‌ర్ లో సినిమా చేసుకోవ‌డం త‌మ‌కు వ‌చ్చిన 8.20 కోట్ల న‌ష్టాన్ని తిరిగి చెల్లించ‌క‌పోవ‌డంతో ట్రిడెంట్ ఆర్ట్స్ వ‌ర్గాలు కోర్టుని ఆశ్ర‌యించాయి. ఆ మొత్తం తిరిగి త‌మ‌కు చెల్లించే వ‌ర‌కు `చ‌క్ర‌` రిలీజ్‌ని నిలిపివేయాల‌ని కోర‌డంతో మ‌ద్రాస్ హైకోర్టు ఈ మూవీ రిలీజ్‌పై స్టేవిధించ‌డం సంచ‌ల‌నంగా మారింది.