Begin typing your search above and press return to search.

బీచ్ బికినీలో టాప్ లేపిన క్యూట్ త్రిథా

By:  Tupaki Desk   |   5 Feb 2022 12:30 PM GMT
బీచ్ బికినీలో టాప్ లేపిన క్యూట్ త్రిథా
X
ఒంటిపై నూలు పోగైనా లేకుండా ప్ర‌ద‌ర్శించ‌డం ఒక క‌ళ‌. ఇందులో పీహెచ్ డీ ప‌ట్టానే పుచ్చుకుంటున్నారు నేటిత‌రం నాయిక‌లు. జాన్వీ-సారా-అన‌న్య కారేరీ టూపీస్ ప్ర‌ద‌ర్శ‌న‌క‌న‌ర్హం! అన్న చందంగా అనునిత్యం వెబ్ ప్ర‌పంచంలో ఫోటోషూట్ల మాయాజాలం చూస్తున్న‌దే. ఇప్పుడు వీళ్లెవ‌రికీ త‌గ్గ‌ని రీతిలో సౌత్ బ్యూటీ త్రిథా చౌద‌రి ఇచ్చిన ఫోజులు మెంట‌లెక్కిస్తున్నాయి. ఇటీవ‌ల కాలంలో వ‌రుస వెబ్ సిరీస్ ల‌తో ఈ అమ్మ‌డు కెరీర్ ని ప‌రుగులు పెట్టిస్తోంది. వెబ్ ప్ర‌పంచంలో హాట్ స్టార్ గా త్రిథా పేరు మార్మోగుతోంది. ఇదే అద‌నుగా వ‌రుస ఫోటోషూట్ల‌తో సోష‌ల్ మీడియా అభిమానుల‌ను పెంచుకుంటోంది. త‌ద్వారా యాడ్ రెవెన్యూ అమాంతం పెరుగుతోంది.

త్రిధా చౌదరి తెలుగు వారికి సుప‌రిచితం. ఈ బ్యూటీ నిఖిల్ సహా ప‌లువురు యువ‌హీరోల స‌ర‌స‌న టాలీవుడ్ లో న‌టించింది. అత్యంత ప్రజాదరణ పొందిన ట్యాలెంటెడ్ సౌత్ నటీమణిగా గుర్తింపును సంపాదించింది. త్రిథా అద్భుతమైన ఫోటోలు వీడియోలకు యూత్ లో గొప్ప ఫాలోయింగ్ ఉంది.

తాజాగా త్రిథా త‌న త్రోబ్యాక్ ఫోటోల‌తో ఇంటర్నెట్‌లో మంటలు పెడుతోంది. ఇన్ స్టాగ్రామ్ లో త్రిధా రెండు హాటెస్ట్ ఫోటోల‌ను షేర్ చేసింది. ఇందులో ఎల్లో టూపీస్ సంథింగ్ హాట్ అనే చెప్పాలి. అలాగే నారింజ మోనోకిని ధరించి ఉన్న ఫోటోను కూడా త్రిథా షేర్ చేసింది. ప్రింటెడ్ ష్రగ్ - స్టైలిష్ షేడ్స్‌తో జతగా ఉన్న తన స్విమ్ సూట్ లో ఆమె బీచ్ లో పోజులిచ్చింది. ఇక బీచ్ ఇసుక‌లో అలా ఎల్లో టూపీస్ లో క‌నిపించిన త్రిథాను చూడ‌గానే యూత్ అంతే ఇదిగా స్పందిస్తున్నారు. ఆ రెండు పీస్ లు అడ్డెందుకు? అంటూ ఘాటైన కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.

కేవలం అభిమానులే కాదు.. పరిశ్రమలోని ఆమె స్నేహితులు కూడా ఆమె పర్ఫెక్ట్ ఫిగర్ ని అభినందిస్తూ వ్యాఖ్యానించడాన్ని సామాజిక మాధ్య‌మాల్లో క‌నిపిస్తోంది. తాజా ఫోటోల‌తో పాటు త్రిథా ఇలా రాసింది. కీప్ ఫామ్ .. స్టే బ్రీజీ! అంటూ చ‌లిగాలుల్ని పంచుతోంది. #travelwithtridha #stylewithtridha #luxurylifestyleinfluencer #hotelsandresorts హోటల్ సాఫ్త్ వరల్డ్ అంటూ హ్యాష్ ట్యాగుల్ని వైర‌ల్ చేస్తోంది.

త్రిధా చివరిసారిగా బెంగాలీ హీరో పవన్ సరసన `బాబునీ తేరే రంగ్ మే` పాటలో కనిపించింది. ఈ పాట‌ను న‌టుడు శర్వి యాదవ్ పాడారు. డాక్టర్ సాగర్ లిరిక్ రాశారు. సలీం - సులైమాన్ సంగీతం సమకూర్చారు. త్రిదా చౌదరి తెలుగు- హిందీ- బెంగాలీ సినిమాల్లో నటించారు. శ్రీజిత్ ముఖర్జీ తెర‌కెక్కించిన‌ 2013 చిత్రం `మిషవర్ రాహోశ్యో`తో ఆమె సినీరంగ ప్రవేశం చేసింది. ఆమె స్టార్ ప్లస్ సిరీస్ డహ్లీజ్ తో టెలివిజన్ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. జోడి లవ్ డిలే నా ప్రణే- ఖాద్- మెర్రీ క్రిస్మస్- ఖావ్టో -శేష్ తేకే షురు 5 కి తదిత‌ర‌ బెంగాలీ చిత్రాలలో న‌టించింది. త‌దుప‌రి రణబీర్ కపూర్ `షంషేరా`లో కనిపించ‌నుంది.

త్రిదా చివరిసారిగా బాబీ డియోల్ వెబ్-సిరీస్ `ఆశ్రమం` రెండవ సీజన్ లో కనిపించింది. ఇందులో ఆమె అదితి సుధీర్ పోహంకర్ తో కలిసి నటించింది.

త్రిధా తెలుగు కెరీర్:

`సూర్య వర్సెస్ సూర్య` చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైన‌ త్రిధా చౌద‌రి నిఖిల్ స‌ర‌సన చ‌క్క‌ని న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంది. ఆ త‌ర్వాత‌ `మనసుకు నచ్చింది` అనే చిత్రంలోనూ న‌టించింది. వ‌రుస‌గా చిన్న బ‌డ్జెట్ సినిమాల‌తో యూత్ కి చేరువైంది. సెవెన్.. అనుకున్న‌దొక్క‌టి అయిన‌దొక్క‌టి చిత్రాల‌తో ఇటీవ‌లే తెలుగు ప్రేక్ష‌కులకు చేరువైంది. అయితే ఆశించిన రేంజులో త్రిధాకు స‌క్సెస్ ద‌క్క‌లేదు. ఈ భామ ఇటు సౌత్ తో పాటు అటు బాలీవుడ్ సినిమాలతోనే బిజీగా ఉన్నా బిగ్ బ్రేక్ అయితే ద‌క్క‌లేదు. అక్కడ సీరియల్స్ వెబ్ సిరీస్ ల‌తోనూ పాపుల‌ర‌వుతోంది. స్పాట్ లైట్ అనే వెబ్ సిరీస్ తో త్రిధా పేరు ఇటీవ‌ల మార్మోగింది. ఈ సిరీస్ ఆద్యంతం వేడెక్కించే లిప్ లాక్ ల‌తో త్రిధా మంట‌లు పుట్టించింది. ఇటీవ‌ల ఆశ్ర‌మం సిరీస్ సీజ‌న్ 2 లోనూ త్రిధా త‌న‌దైన అందం న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంది.