Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: ఆ బాటిల్ బ్రాండ్ ఏమిటి అమ్మ‌డూ?

By:  Tupaki Desk   |   19 Oct 2020 12:30 AM GMT
ఫోటో స్టోరి: ఆ బాటిల్ బ్రాండ్ ఏమిటి అమ్మ‌డూ?
X
4Gs కంటే పైన ఉన్నాను నేను.. గ్రాటిట్యూడ్.. ఎదుగుద‌ల‌.. గ్లామ‌ర్.. గ్లోవింగ్ అన్నిటిలో అని అంటోంది త్రిధా చౌద‌రి. క్యూట్ లుక్స్ తో హాట్ అప్పియరెన్స్ ని మిక్స్ చేసి కుర్ర‌కారు గుండెల్ని దోచేయ‌డం ఈ అమ్మ‌డి ప్ర‌త్యేక‌త‌. తాజాగా గోవా బీచ్ లో వాలిపోయి ఇదిగో ఇలా చిలౌట్ చేస్తోంది. ఏకంగా 5జీ బ్రాండులా క‌నిపిస్తోంది బీచ్ ప‌రిస‌రాల్లో.

మొన్న‌టికి మొన్న `స్పాట్ లైట్` వెబ్ సిరీస్ లో అడ్డూ అదుపూ లేని పెద‌వి ముద్దుల‌తో హీట్ పుట్టించిన త్రిధా .. ఇప్పుడిలా తీరిక స‌మ‌యాన్ని గ్రాండ్ గా ప్లాన్ చేసింది. బికినీ బీచ్ ప‌రిస‌రాల్లో ఖ‌రీదైన బాటిల్ చేత‌ప‌ట్టి అగ్గి రాజేస్తోంది. ఆ బాటిల్ చూడ‌గానే అంద‌రిలో ఒక‌టే సందేహం. ఇంత‌కీ అది ఏ బ్రాండ్ ? అంటూ ప్ర‌శ్న‌ల‌తో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు.

అదేమైనా ఖ‌రీదైన విదేశీ షాంపైన్ బాటిలా? అంటూ ఒక‌టే ఇదైపోతున్నారు. మందుబాబుల‌కు అయితే నాలుక పిడ‌చ‌క‌ట్టేస్తోంది. ఇంత‌కీ మీలో గ్లో పెంచిన ఆ సీక్రెట్ బాటిల్ గుట్టు విప్ప‌వా ప్లీజ్‌? అంటూ ఒక‌టే అడిగేస్తున్నారు. మ‌రి త్రిధా వ‌ద్ద ఆన్స‌ర్ ఉందా? ఆ ర‌హ‌స్యం చెబుతుందంటారా? గోవా డైరీస్ లో మ‌ర‌పురాని ఈ రోజుల్ని షాంపైన్ తో అలా అలా లాగించేస్తోంద‌న్న‌మాట‌.