Begin typing your search above and press return to search.
అదే స్టోరీ అని మళ్ళీ కన్ఫామ్ చేశారు..
By: Tupaki Desk | 17 May 2018 4:46 AM GMTఓ తరహా సినిమా హిట్ అయితే.. వరుసగా అదే బాపతుగా మూవీస్ వచ్చేయడం కనిపిస్తూనే ఉంటుంది. కానీ ఒక థీమ్ సక్సెస్ సాధించిందని.. అదే టెంప్లేట్ తో ఓ దర్శకుడు వరుసగా అదే తరహా సినిమాలు చేస్తుండడం మాత్రం కాసింత ఆలోచించాల్సిన విషయమే.
యంగ్ హీరో రామ్ తో దర్శకుడు నక్కిన త్రినాథరావు 'హలో గురూ ప్రేమ కోసమే' అంటూ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. రీసెంట్ గా ఫస్ట్ లుక్ కూడా ఇచ్చారు. రామ్ బర్త్ డే సందర్భంగా ఇచ్చిన ఈ ఫస్ట్ లుక్ కి మిక్సెడ్ రెస్పాన్స్ రాగా.. ఈ చిత్రంలో హీరో పాత్రపై ఓ క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు. 'ఇదో మాంచి లవ్ స్టోరీ. బాగా ఫన్నీగా సాగే స్క్రీన్ ప్లే. రామ్ క్యారెక్టర్ లో వేరియేషన్స్ ఆకట్టుకుంటాయి. ఇలాంటి పాత్ర రామ్ ఎప్పుడూ చేయలేదు. ఆడియన్స్ ను రామ్ థ్రిల్ చేయబోతున్నాడు' అని చెబుతున్న దర్శకుడు త్రినాథ రావు.. ఈ సినిమాకి మామతో అల్లుడి ఫైట్ ఎలా ఉంటుందనే పాయింట్ హైలైట్ అవుతుందని చెబుతున్నాడు.
కాన్సెప్ట్ పరంగా బాగానే అనిపిస్తున్నా.. ఇదే దర్శకుడు గతంలో రూపొందించిన సినిమా చూపిస్త మామా.. నేను లోకల్ చిత్రాలు కూడా ఇదే ప్లాట్ పై సాగుతాయి. వీటిలో ఒకటి హిట్టు.. రెండోది బ్లాక్ బస్టర్ కూడా అయిపోయాయి. దీంతో మళ్లీ అదే కథను ముచ్చటగా మూడోసారి కూడా రివైండ్ చేయబోతున్నాడు ఈ డైరెక్టర్. మరి ఈ సారి కూడా మామా అల్లుళ్ల ఆట.. సక్సెస్ ను తెచ్చిపెడుతుందో లేదో చూడాలి.