Begin typing your search above and press return to search.

మామా అల్లుళ్ల ఫార్ములా.. 3వ సారి

By:  Tupaki Desk   |   26 Dec 2017 11:00 AM IST
మామా అల్లుళ్ల ఫార్ములా.. 3వ సారి
X
ప్రస్తుత రోజుల్లో వచ్చే చాలా సినిమా కథలు ఇతర సినిమా కథలతో పోలి ఉంటాయని అందరికి తెలిసిన విషయమే. కాకపోతే మన దర్శకులు టెస్ట్ ని కొంచెం కొత్తగా చూపిస్తున్నారు. ఆల్ రెడీ వచ్చిన కథే అయినా కూడా స్క్రీన్ ప్లే అసలు ఫార్ములా కాబట్టి ఆ విషయంపై పెన్నుకు పదును పెడుతున్నారు. ఇక డైలాగ్స్ కూడా కొత్తగా ఉండేలా చూసుకొని మొత్తానికి పాత కథని కొత్తగా చూపించేలా ప్రయత్నం చేస్తున్నారు.

ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే.. సినిమా చూపిస్తా మావ - నేను లోకల్ సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు త్రినాథ రావ్ నక్కిన వరుసగా మూడవసారి కూడా అదే ఫార్ములాను చూపించబోతున్నాడు. మామ అల్లుళ్ల సవాల్ చాలా సినిమాల్లో చూశాం కానీ ఈ దర్శకుడు చాలా కొత్తగా తన స్టైల్ లో చూపిస్తున్నాడు. దిల్ రాజు ప్రొడక్షన్ లో రామ్ హీరోగా తెరకెక్కుతోన్న ఆ చిత్రం త్వరలో స్టార్ట్ కానుంది. దర్శకుడు త్రినాధ్ నిర్మాత దిల్ రాజు ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో చాలా బిజీగా ఉన్నారు. హీరోయిన్స్ విషయంలో కొంచెం సస్పెన్స్ ని మెయింటేన్ చేస్తోంది చిత్ర యూనిట్. అయితే సినిమాలోని కీలకమైన మామ పాత్రకు ఎవరు సెలక్ట్ అయ్యారు అని ఆరా తీస్తే.. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ సెట్ అయ్యారని తెలిసింది.

మరికొన్ని రోజుల్లో రెగ్యులర్ షూటింగ్ ని స్టార్ట్ చేసి సినిమాను సమ్మర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మరి మూడవసారి మామ అల్లుళ్ల సవాల్ ఈ దర్శకుడికి ఎంత వరకు లాభాన్ని ఇస్తుందో చూడాలి.