Begin typing your search above and press return to search.
క్షమాపణలు కోరిన ‘ధమాకా’ దర్శకుడు.. ఎందుకంటే?
By: Tupaki Desk | 22 Dec 2022 12:46 PM GMTమాస్ మహారాజ్ రవితేజ.. హీరోయిన్ శ్రీలీల కాంబినేషన్లో దర్శకుడు త్రినాథ తిక్కన తెరకెక్కించిన సినిమా ‘ధమాకా’. ఈ మూవీ డిసెంబర్ 23న (రేపు) ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెల్సిందే. ఇక ఈ మూవీ రిలీజు డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో మూవీ టీం కొన్ని రోజులుగా భారీ ప్రమోషన్స్ చేస్తుంది.
ఇందులో భాగంగానే సినిమాకు సంబంధించిన పోస్టర్స్.. ట్రైలర్.. టీజర్.. సాంగ్స్ ను చిత్రబృందం ఇటీవల విడుదల చేసింది. వీటిన్నింటిని అభిమానుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో హీరో రవితేజ.. హీరోయిన్ శ్రీలీల.. దర్శకుడు త్రినాథ తిక్కన తదితరులు హాజరై మాట్లాడారు. డైరెక్టర్ త్రినాథ తిక్కన మాట్లాడుతున్న సందర్భంలో ‘‘ఏంటీ నీ ఉప్పర సోది’’ అంటూ కామెంట్ చేశాడు. ఇది కాస్తా వైరల్ కావడంతో ఉప్పర కులస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ మనోభావాలు దెబ్బతినేలా దర్శకుడు మాట్లాడటంపై ఉప్పర కులస్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో నేడు హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ వద్ద తెలంగాణ ఉప్పర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ ఆధ్వర్యంలో ఉప్పర కులస్తులు ఆందోళన చేపట్టారు. ‘ధమాకా’ దర్శకుడు త్రినాథ నక్కిన.. నిర్మాత లు ఉప్పర కులస్తులకు క్షమాపణ చెప్పాలని దిష్టిబొమ్మను దహనం చేసి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.
ఈక్రమంలోనే దర్శకుడు త్రినాథ నక్కిన ఉప్పర కులస్తులకు బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. తనపై ఉన్న కోపాన్ని సినిమాపై చూపించొద్దని వేడుకున్నాడు. తాను బీసీనేనని ఉప్పరులు కూడా బీసీల్లో భాగమేనని గుర్తు చేశాడు. అక్కడితో ఆగిపోకుండా ఉప్పర పదాన్ని బహిష్కరించాలని.. ఇకపై రాజకీయ నాయకులు.. సినీసెలబెట్రీలు.. ఇతరులు ఈ పదం వాడొద్దని సూచించారు. దీంతో ఈ వివాదానికి ఎండ్ కార్డు పడినట్లయింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.