Begin typing your search above and press return to search.
ట్రీపుల్ ఆర్ ఓటీటీ రిలీజ్ .. వాళ్లని ఆపడం కష్టమేనా?
By: Tupaki Desk | 28 April 2022 2:30 AM GMTమల్టీస్టారర్ సినిమాలు చూడాలని ప్రేక్షకులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. ఆయా సినిమాల్లో ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తే ఆ ఆనుభూతిని కళ్లారా ఆస్వాదించాలని కోరుకుంటున్నారు. కానీ అభిమానుల తీరు మాత్రం ఇందకు విరుధంగా కనిపిస్తోంది. ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తే ఆ సినిమాని సగటు ప్రేక్షకుల్లా ఆస్వాదించడం మానేసి అందులో లోపాల్ని వెతుకుతూ సరికొత్త రచ్చకు తెరతీస్తున్నారు. ఇటీవల విడుదలైన 'ట్రీపుల్ ఆర్' విషయంలోనూ ఇదే తరమా పరిస్థితి కనిపించింది. ఇప్పటికీ అదే పరిస్థితి అబిమానుల్లో నెలకొంది.
వివరాల్లోకి వెళితే.. దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన భారీ మల్టీస్టారర్ మూవీ 'ట్రిపుల్ ఆర్'. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తొలిసారి కలిసి నటించారు. మార్చి 25న భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ సంచలన విజయాన్ని సాధించడమే కాకుండా పలు రికార్డుల్ని బద్దలు కొట్టింది. 1100 కోట్లకు పైగా వసూళ్లని రాబట్టి ప్రస్తుతం విజయవంతంగా ప్రదర్శింపబడుతూ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది.
ఈ మూవీ విడుదల నుంచి ఈ చిత్రంపై ఎన్టీఆర్ అభిమానులు, మెగా ఫ్యాన్స్ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. సినిమా సాధిస్తున్న వసూళ్లని, రికార్డుల్ని పక్కన పెట్టి సినిమాలో మా హీరో క్యారెక్టర్ గొప్ప అంటే లేదు మా హీరో క్యారెక్టర్ ని గొప్పగా మలిచారని సోషల్ మీడియా వేదికగా ప్రచ్ఛన్న యుద్ధం చేయడం మొదలు పెట్టారు. ప్రి ఇంటర్వెల్ బ్యాంగ్ కి సంబంధించిన సీన్ ని థియేటర్ లో పైరసీ చేసి సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.
ఈ సీన్ లో ఎన్టీఆర్ విజిల్స్ వేసే స్థాయిలో అద్భుతంగా నటించాడు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో లీక్ తరువాత ఎన్టీఆర్, చరణ్ అభిమానుల్లో మార్పు రాలేదు సరికదా ఈ రచ్చ మరింతగా పెరిగింది. మా హీరోని తగ్గించారని ఎన్టీఆర్ ఫ్యాన్స్ గొడవకు దిగితే మా హీరో పాత్రకే ప్రాధాన్యత నిచ్చారని చరణ్ ఫ్యాన్స్ విరుచుకుపడ్డారు. దీంతో ఇద్దరు అభిమాన గ్రూపుల మధ్య సోషల్ మీడియా వేదికగా వార్ మొదలైంది.
ఇదిలా వుంటే త్వరలో ఈ వార్ పతాక స్థాయికి చేరే అవకాశం వుందని చెబుతున్నారు. కారణం 'ట్రిపుల్ ఆర్' మేలో నెట్ ఫ్లిక్స్ తో పాటు జీ5లోనూ స్ట్రీమింగ్ కాబోతోంది. ఇందులో చాలా వరకు నిడివి కారణంగా లేపేసిన సీన్ లు వుండే అవకాశం వుందని అంటున్నారు. ఈ సందర్భంగా ఇద్దరు హీరోల ఫ్యాన్స్ మధ్య వార్ మళ్లీ మొదలవుతుంది.
కొన్ని పొరపాటున సీన్ లు ఎక్కువైతే ఎన్టీఆర్, చరణ్ అభిమానుల రచ్చ పతాక స్థాయికి చేరుకుంటుంది. వాళ్లని ఇక ఆపడం ఎవరి వళ్లకాదు అనే వాదన వినిపిస్తోంది. అంతే కాకుండా నెట్ ఫ్లిక్స్, జీ5లో సినిమా స్ట్రీమింగ్ అయిన తరువాత క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ గా పోస్ట్ చేస్తారని, తద్వారా ఇద్దరు హీరోల్లో మళ్లీ ఎవరికి ప్రాధాన్యత తగ్గిందో తెలుసుకోవడానికి క్లిప్ లు సేర్ చేస్తూ రచ్చ చేసేలా వున్నారని, ఓటీటీ లో సినిమా రిలీజ్ అయితే ఫ్యాన్స్ ని ఆపడం కష్టమేనని అంటున్నారు.