Begin typing your search above and press return to search.
సాయిపల్లవి నిజ జీవితంలోనూ కూతురేనట
By: Tupaki Desk | 20 Jun 2022 4:58 AM GMTత్రిపురనేని సాయిచంద్.. నిన్నటితరం ప్రేక్షకులకు బాగా పరిచయం ఉన్న నటుడు. 80, 90 దశకాల్లో బోలెడన్ని సినిమాల్లో నటించారాయన. 'శివ' సహా చాలా సినిమాల్లో సాయిచంద్ చేసిన క్యారెక్టర్ రోల్స్ గుర్తుండిపోయేవే. ఐతే ఉన్నట్లుండి ఆయన కనుమరుగైపోయారు. సినిమాలకు దూరం అయ్యారు. లెజెండరీ రైటర్ త్రిపురనేని గోపీచంద్ తనయుడైన సాయిచంద్.. చాలా ఏళ్ల పాటు వార్తల్లో లేరు.
అందరూ మరిచిపోయిన టైంలో 'ఫిదా' సినిమాతో ఆయన రీఎంట్రీ ఇచ్చారు. నటనలో అన్నేళ్ల విరామం వచ్చినా.. ఆయన ఏ తడబాటు లేకుండా సాయిపల్లవి తండ్రి పాత్రలో ఒదిగిపోయిన తీరుకు అందరూ ఫిదా అయిపోయారు.
ఆ తర్వాత సైరా, చెక్, కొండపొలం లాంటి చిత్రాల్లో అద్భుతంగా నటించి ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు 'విరాటపర్వం'లో మరోసారి సాయిపల్లవి తండ్రి పాత్రలో ఆయన ఆకట్టుకుంటున్నారు. నిజ జీవితంలో పెళ్లి చేసుకోని ఆయన.. వెండితెరపై తన కూతురిగా నటించిన సాయిపల్లవినే తన కూతురిగా పేర్కొంటుండటం విశేషం.
ఆదివారం ఫాదర్స్ డే సందర్భంగా.. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను తెరపై తండ్రి పాత్రలే చేస్తుండటంపై ఆయన స్పందించారు. ఈ సందర్భంగా సాయిపల్లవితో తన అనుబంధం గురించి మాట్లాడారు. "ఫిదా సినిమా కోసం ఓ సన్నివేశంలో నటించి తిరిగొస్తున్నపుడు 'నాన్న.. మనం మళ్లీ కలుద్దాం' అంటూ సాయిపల్లవి నా దగ్గరికొచ్చి అంది.
తను నన్ను మామూలుగా నేను ఎవరితో నటించినా సన్నివేశం పూర్తయ్యాక మామూలుగా మారిపోతాను. కానీ సాయిపల్లవితో నటించాక తొందరగా ఆ ప్రభావం నుంచి బయటికి రాలేకపోయాను. తెరపైనే కాదు నిజ జీవితంలోనూ నాకు ఆమె కూతురిగా మారిపోయింది.
సాయిపల్లవి నా జీవితంలోకి వచ్చాక తండ్రిగా నేను మిస్ అయిన అనుభూతులన్నీ ఆమె ఇచ్చింది. ఇప్పటికీ ఆమె నన్ను బయట నాన్న అనే పిలుస్తంుది. నేను కన్నా అంటుంటా. నేను జీవితంలో తండ్రి కాకపోయినా ఆ లోటు తెలియకుండా సాయిపల్లవి వల్ల నాన్నగా మారాను.