Begin typing your search above and press return to search.

నాలుగు పదుల వయసులో కూడా కలలే కంటోంది

By:  Tupaki Desk   |   25 March 2020 7:30 PM GMT
నాలుగు పదుల వయసులో కూడా కలలే కంటోంది
X
త్రిష సినిమా పరిశ్రమలో అడుగు పెట్టి రెండేళ్లు అయితే రెండు దశాబ్దాలు పూర్తి చేసుకోబోతుంది. మరో రెండు మూడు సంవత్సరాలు అయితే ఆమె వయసు కూడా నాలుగు పదుల వయసుకు చేరుతుంది. ఇలాంటి సమయంలో పెళ్లి చేసుకోవాల్సింది పోయి ఇంకా పెళ్లి గురించి కలలు కంటూనే ఉంది అంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. తాజాగా ఈ అమ్మడు ఒక తమిళ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించిన ఆసక్తికర కామెంట్స్‌ చేసింది.

తెలుగులో తాను నటించనంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు. ఒకానొక సమయంలో తమిళంలో బిజీగా ఉన్న కారణంగా తెలుగులో వచ్చిన ఆఫర్‌ ను వదిలేశాను. అంతే తప్ప తెలుగులో నటించకూడదని తానేం భావించడం లేదంది. 15 ఏళ్ల తర్వాత మాలీవుడ్‌ లో వరుసగా చిత్రాలు చేస్తున్నాను. ఇప్పుడు అక్కడ నుండి మంచి కథలు నా వద్దకు వచ్చాయని త్రిష చెప్పింది. ఇక గత కొన్ని రోజులుగా పెళ్లి గురించి వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చింది.

ప్రస్తుతానికి తానేం డేటింగ్‌ లో లేనంది. కొందరు ప్రచారం చేస్తున్న ప్రకారం నాకు తెలియకుండా నేను ఏమైనా డేటింగ్‌ ల ఉన్నానేమో అంటూ జోక్‌ చేసింది. తన పెళ్లి విషయమై ఇప్పటి వరకు మీడియాలో వచ్చిన.. వస్తున్న వార్తలు అన్నీ కూడా పుకార్లే. అయితే తన పెళ్లి మాత్రం పెద్దల తో సంబంధం లేకుండా జరుగుతుందని చెప్పుకొచ్చిన త్రిష లాస్‌ వెగాస్‌ అంటే నాకు చాలా ఇష్టం. అందుకే అక్కడ పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నాను. వీలుంటే ఖచ్చితంగా అక్కడ పెళ్లి చేసుకోవడంతో పాటు అక్కడే కొంత కాలం హాయిగా జీవితాన్ని గడపాలనేది తన కల అంటూ చెప్పుకొచ్చింది.

నాలుగు పదుల వయసు వచ్చిన త్రిష ఇంకా పెళ్లి గురించి కలలు కంటూ కూర్చోవడం విడ్డూరంగా ఉంది అంటూ కొందరు నెటిజన్స్‌ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆఫర్లు లేకున్నా కూడా ఈ అమ్మడు సినిమానే పట్టుకుని వేలాడటం ఎందుకు అంటూ కొందరు అంటున్నారు. మొత్తానికి త్రిషపై నెటిజన్స్‌ పెళ్లి విషయంలో తెగ మీమ్స్‌ చేసి విమర్శలు చేస్తున్నారు.