Begin typing your search above and press return to search.
ఆ పోస్టులన్నీ ఉత్తుత్తివేనా భామలూ??
By: Tupaki Desk | 23 Jan 2017 6:55 AM GMTముఖ్యంగా తమిళ హీరోయిన్లలో త్రిష.. సింగర్ చిన్మయి.. ఇలా అందరూ కూడా పెటా పెటా పెటా అంటూ తెల్లారిలేస్తే చాలు తెగ కలవరించేశేవారు. కాని ఒక్క దెబ్బతో వీరి నిజ స్వరూపం బయటపడిపోయింది. తమిళనాట తమ పేరు ప్రఖ్యాతులు.. తమ బిజినెస్.. తమకు పని.. తమ క్రేజే ముఖ్యమా లేకపోతే నీతి నిజాయితీ మానవతావాదం ముఖ్యమా అంటే మాత్రం.. తమిళ సెలబ్రిటీలందరూ మాకు మా క్రేజే ముఖ్యం అనేశారు. పెటా సాక్షిగా వీరందరూ జల్లికట్టుకు మద్దతునిచ్చి.. అది వీర తమిళ సంస్కృతికి చిహ్నం అంటూ తెగేసి చెప్పేశారు.
కొన్ని సంవత్సరాల నుండి త్రిష మాట్లాడితే ట్విట్టర్లో చిన్న చిన్న కుక్కపిల్లల గురించి.. మిస్సింగ్ పెట్స్ గురించి.. జంతుజీవాలను చూడాల్సిన తీరు గురించి.. నానా రచ్చ చేస్తోంది. కుక్కల మీదన మరే హీరోయిన్ కు లేనంత ప్రేమ ఈమెకు ఉందన్నట్లు బిల్డప్ ఇచ్చేసింది. ఇక సింగర్ చిన్మయి కూడా అంతే.. మాట్లాడితే కుక్కలు గురించి నానా హడావుడి చేసేసిది. కాని ఇప్పుడు తమిళ జనుల సంతోషం కోసం మాకు అమాయకపు ఎద్దులను హింసించే జల్లికట్టు కావాలంటూ చెప్పడం.. ఖచ్చితంగా అది జంతుప్రేమకు వ్యతిరేకమైన చర్యనే అవుతోంది. అలాంటప్పుడు ఇన్నాళ్ళూ కుక్కలపై త్రిష అండ్ చిన్మయి కురిపించిన ప్రేమ అంతా జస్ట బోగస్ అనే అనుకోవాలి కదా?
ప్రస్తుతం నెటిజన్లకు అర్దంకాని విషయం అదే. శునకాలపై ఆ రేంజు ప్రేమ కురిపించిన వీరు.. అక్కడ జల్లికట్టు కావాలంటూ జనాలు మౌన పోరాటం చేస్తున్నారు అంటూ ఇప్పుడు రోడ్డెక్కడం.. పెటా సంస్థపై నిప్పులు చెరగడం.. వామ్మో.. వాటే టర్నింగ్ పాయింట్ గురూ.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/