Begin typing your search above and press return to search.
కళావతి కామెడీ చేస్తోందా?
By: Tupaki Desk | 22 Jan 2016 1:30 AM GMTహారర్ కామెడీ.. ఈ జోనర్ ఇప్పుడు విపరీతం అయిపోతోంది. భయపెట్టే సినిమాల్లో, రిలీఫ్ టానిక్ లా ఉపయోగించుకుని సక్సెస్ కొట్టే కాన్సెప్టే కామెడీ అయిపోతోందా అనిపించక మానదు. ఈ జోనర్ లో వచ్చిన వాటిలో రెండు మూడు హిట్ కావడంతో, ఇక వరుసగా అన్నీ ఇదే బాపతుగా తయారైపోతున్నాయి. కానీ ఇలా హిట్ కొట్టిన వాటిలో ఒకటి కోలీవుడ్ మూవీ అరణ్మణై. తెలుగు చంద్రకళ పేరుతో వచ్చి మంచి సక్సెస్ నే సాధించిన ఈ మూవీకి సీక్వెల్ కూడా సిద్ధమైపోయింది.
సెకండ్ పార్ట్ అయిన అరణ్మణై2 తెలుగు వెర్షన్ కు కళావతి అనే టైటిల్ ఫిక్స్ చేశారు. మొదటి సినిమాలో హన్సిక ఒకటే భయపడితే, ఈసారి త్రిషను కూడా వెంట తెచ్చుకున్నారు. విచిత్రంగా త్రిషతో కూడా దెయ్యం గెటప్పే వేయించడంతో మొదటి నుంచీ డౌట్ కొట్టడం మొదలైంది. త్రిషతో భయపెట్టించడం అంత తేలికైన విషయమేం కాదు. అమ్మడి ఫేస్ కూడా అంత భయానకంగా ఏం ఉండదు. దీనికి తోడు చేసినవన్నీ గ్లామరే తప్ప., పెర్ఫామెన్స్ కి స్కోప్ ఉన్న రోల్స్ తో పెద్దగా పని లేకపోయింది ఈ భామకి. ఇప్పుడు కళావతి పోస్టర్ చూస్తుంటే ఈ విషయం స్పష్టంగా అర్ధమవుతుంది ఎవరికైనా.
ఏదో.. భయంకరంగా చూస్తున్నట్లు పోజు ఉన్నా.. ఆ ఫోటోని చూడగానే ఏదో ఒక స్పూఫ్ గుర్తుకు రావడం సహజం. ఎందుకంటే మన టాలీవుడ్ లో కామెడీ అంటే స్పూఫ్ లే ఎక్కువగా ఉంటాయి. థర్టీ ఇయర్స్ పృథ్వీ ఇలాంటివి బోలెడన్ని చేశాడు. కళావతిలో త్రిష పోస్టర్ ని చూసినా అలా స్పూఫ్ చూస్తున్నట్లుంది తప్ప.. దెయ్యం సినిమా అనిపించడం లేదు. హారర్ కామెడీలో.. కామెడీ వరకూ త్రిషకు ఇచ్చారేమో అనిపిస్తోంది.