Begin typing your search above and press return to search.
కోటి హీరోకి మూడు కోట్ల హీరోయిన్?
By: Tupaki Desk | 5 Dec 2015 5:26 AM GMTశివ కార్తికేయన్.. తమిళనాట మార్మోగిపోతున్న పేరు ఇది. వరుసగా హిట్టు మీద హిట్టు కొట్టేస్తూ ఘంటారావం మోగించేస్తున్నాడు ఈ యంగ్ హీరో. ఎతిర్ నీచల్.. వలిబార్ సంఘం.. వంటి సినిమాలతో పెద్ద స్టార్ అయిపోయాడు ఈ టివి యాంకర్. అయితే ఇతగాడికో పెద్ద చిక్కొచ్చి పడింది. ఛోటా హీరో రేంజ్ నుంచి మిడ్ రేంజు హీరోగా ఎదిగేసిన ఇతగాడికి అటు టాప్ క్లాస్ హీరోయిన్లెవరూ దొరకడం లేదు.
సమంత - నయనతార - త్రిష లాంటి హీరోయిన్ లు కార్తికేయన్ సరసన నటించేందుకు విముఖత చూపిస్తున్నారు. నటించం అని చెప్పకుండా 3 కోట్లు కావాలి - 4 కోట్లు కావాలి అంటూ డిమాండ్ చేస్తూ ప్రాజెక్టుల్ని వదిలించుకుంటున్నారని కోలీవుడ్ లో ప్రచారమవుతోంది. ఇటీవలే అందాల సమంతని ఈ హీరో సరసన నటించాల్సిందిగా కోరారు. దానికి సమంత ససేమిరా అందిట. అలాగే ఫేడవుట్ అయిపోయిందనుకున్న త్రిష సైతం శివకార్తికేయేన్ సరసన నటించాలంటే 3 కోట్లు డిమాండ్ చేస్తోందని చెబుతున్నారు. నయనతార కూడా ఇప్పటికే 3 కోట్ల క్లబ్ హీరోయిన్ కాబట్టి వీళ్లని ఒప్పించాలంటే కార్తికేయన్ వల్ల కావట్లేదని చెబుతున్నారు.
ఎంత చెట్టుకు అంత గాలి. మరీ అంత పెద్ద హీరోయిన్ లు దొరక్కపోతేనేం, కొత్త మోడల్స్ ని ఎంపిక చేసుకుని వాళ్లను కూడా ఒక నయనతార - త్రిషలా తయారు చేస్తే తప్పేం లేదు హీరోగారూ. ఆ తర్వాత మీ పేరే కదా చెప్పుకునేది. సర్లేండి.. మనోడు మాత్రం.. నాకంటే 2 కోట్లు ఎక్కువగా తీసుకున్నా పర్లేదు.. లెటజ్ గో ఫర్ నయన్ ఆర్ త్రిష్ అంటున్నాడు. మనోడికి ప్రస్తుతం సినిమాకు 1 కోటి ముడుతోంది. ఏంటో పైత్యం!!