Begin typing your search above and press return to search.

ఆ డిజిటల్‌ మూవీకి నలుగురు స్టార్‌ హీరోయిన్స్‌ సపోర్ట్‌

By:  Tupaki Desk   |   8 Jun 2020 5:45 AM GMT
ఆ డిజిటల్‌ మూవీకి నలుగురు స్టార్‌ హీరోయిన్స్‌ సపోర్ట్‌
X
కీర్తి సురేష్‌ ప్రధాన పాత్రలో ఈశ్వర్‌ కార్తిక్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పెంగ్విన్‌’ చిత్రం థియేటర్లు ఇప్పట్లో ఓపెన్‌ కావని తేలిపోవడంతో డిజిటల్‌ రిలీజ్‌ కు సిద్దం అవుతున్న విషయం తెల్సిందే. అమెజాన్‌ ప్రైమ్‌ లో ఈ సినిమాను సౌత్‌ భాషలతో పాటు హిందీలో కూడా విడుదలకు సిద్దం చేస్తున్నారు. సినిమా ప్రమోషన్‌ లో భాగంగా నేడు టీజర్‌ ను విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రం నాలుగు భాషల్లో నలుగురు స్టార్‌ హీరోయిన్స్‌ తో టీజర్‌ విడుదల చేయించబోతున్నారు.

తెలుగు టీజర్‌ ను సమంత విడుదల చేయబోతుండగా.. తమిళ టీజర్‌ ను త్రిష విడుదల చేయనుంది.. ఇక మలయాళ వర్షన్‌ టీజర్‌ ను మంజు వారియర్‌ చేతుల మీదుగా విడుదల చేయించనున్నారు. ఇక హిందీ వర్షన్‌ టీజర్‌ ను తాప్సి సోషల్‌ మీడియా ద్వారా నేడు మద్యాహ్నం 12 గంటల సమయంలో విడుదల చేసేందుకు సిద్దం అయ్యారు.

నలుగురు స్టార్‌ హీరోయిన్స్‌ ఈ సినిమా టీజర్‌ ను విడుదల చేయబోతున్న నేపథ్యంలో సినిమాకు మంచి పబ్లిసిటీ దక్కే అవకాశం ఉంది. డిజిటల్‌ ప్లాట్‌ ఫామ్‌ పై విడుదల కాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మరియు సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొని ఉంది. కీర్తి సురేష్‌ ఫస్ట్‌ లుక్‌ ఇప్పటికే సినిమాపై అంచనాలు పెంచే విధంగా ఉంది. జూన్‌ 19వ తారీకు నుండి ఈ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌ స్ట్రీమింగ్‌ అవ్వబోతుంది.