Begin typing your search above and press return to search.
సిద్ధార్థ్.. త్రిష... ఓ జోక్!
By: Tupaki Desk | 27 Jan 2016 7:30 AM GMTహిట్ పెయిర్ అనే మాట ఇండస్ట్రీలో తరచుగా వినిపిస్తుంటుంది. ఒక జంట పదే పదే తెరపై కనిపించి కవ్విస్తే అదే హిట్ పెయిర్ అయిపోతుంది. మొన్న ప్రేక్షకుల ముందుకొచ్చిన సోగ్గాడే చిన్ని నాయనాలో నాగార్జున-రమ్యకృష్ణలని చూసి కూడా అదే మాటన్నాం. అలా పదిహేను, ఇరవయ్యేళ్ల తర్వాత కూడా మళ్లీ తెరపై కనిపించి అదే రకంగా సందడి చేయడమంటే గ్రేటే. అయితే వాళ్ల వాళ్ల అనుభవంతోనూ, యాక్టింగ్ స్కిల్స్ తోనూ వినోదం పండిస్తారేమో కానీ... తెరపై కనిపించే విధానంలో మాత్రం కచ్చితంగా మార్పు కనిపిస్తుంటుంది. నాగార్జున - రమ్యకృష్ణల్ని తెరపై చూస్తున్నప్పుడు ఆ మార్పు స్పష్టంగా తెలిసిపోతుంది.
అయితే దగ్గర దగ్గర పుష్కరకాలం తర్వాత కలిసి తెరపైకొస్తున్న సిద్ధార్థ్ - త్రిషలలో మాత్రం అస్సలేమాత్రం మార్పు కనిపించడం లేదు. యువ - నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాల్లో ఎలా కనిపించారో... ఇప్పుడూ అలాగే కనిపిస్తున్నారు. వీళ్లిద్దరూ జంటగా నటించిన కళావతి ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకొస్తోంది. త్రిషతో మళ్లీ జోడీ కట్టారు కదా... ఆమెతో కలిసి నటించడం ఎలా అనిపిస్తుంటుందని సిద్ధార్థ్ ని అడిగితే మనోడు వాళ్లిద్దరి మధ్య ఈ విషయంపై వచ్చిన ఓ జోక్ గురించి ఇలా చెప్పుకొచ్చాడు.
``నేను త్రిష కలిసి నటించిన మొదటి చిత్రం యువ. అందులో ఓ బీచ్ సాంగ్ ఉంటుంది. కళావతిలోనూ బీచ్ సాంగ్ ఉంది. ఆ పాట చేసేందుకు మేం బీచ్ లోకి వెళ్లగానే పాత రోజులు గుర్తుకొచ్చాయి. పుష్కరకాలంగా మనం ఇదే పనిలో ఉన్నామేంటి? అన్నాన్నేను. త్రిష ఆ మాట వినగానే నవ్వుతూ `ఏం పనిలో ఉన్నాం... బీచ్ లో పాటలు పాడుకొనే పనిలోనేనా?` అంది. దీంతో ఇద్దరం కలిసి నవ్వుకొన్నాం. నా గురించేమో కానీ... త్రిష మాత్రం గ్రేట్. ఒక స్టార్ హీరోయిన్‌గా ఇన్నాళ్లూ ఇండస్ట్రీలో కొనసాగడం ఆషామాషీ కాదు. ఆ ఫిజిక్‌ని అలా మెంటైన్ చేయడం ఇంకా కష్టం. అందుకే త్రిషకే ఎక్కువ మార్కులేస్తా`` అని చెప్పుకొచ్చాడు సిద్ధార్థ్.