Begin typing your search above and press return to search.

తుర్రుమన్న త్రిష పిట్ట

By:  Tupaki Desk   |   26 May 2015 1:30 AM GMT
తుర్రుమన్న త్రిష పిట్ట
X
సౌత్‌ ఇండియా వరకు త్రిష ఎప్పుడూ హాట్‌ టాపిక్కే. ఆమె సినిమాల గురించి కంటే వ్యక్తిగత విషయాలు, వివాదాలతోనే ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటుంది. గత ఆరేడు నెలల్లో త్రిష జీవితంలో జరిగే అనూహ్య మలుపుల గురించి మీడియాలో విపరీతమైన చర్చ జరిగింది. రానాతో బ్రేకప్‌, తర్వాత వరుణ్‌ మణియన్‌తో నిశ్చితార్థం.. ఆపై ఆ నిశ్చితార్థం రద్దవడం.. ఇవన్నీ హాట్‌ టాపిక్కులే. ఐతే ఈ విషయాల గురించి త్రిష నోటి నుంచి ఏమైనా విందామా అని అందరిలోనూ ఆశ. కానీ కొన్నాళ్లుగా ఏ సినిమా ప్రమోషన్‌లోనూ త్రిష కనిపించకపోవడంతో ఆమెను ఈ విషయాలపై ప్రశ్నించే అవకాశమే దక్కలేదు.

అలాంటిది లేక లేక నిన్న 'చీకటి రాజ్యం' ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ రిలీజ్‌ సందర్భంగా కమల్‌తో లిసి హైదరాబాద్‌లో ప్రెస్‌ మీట్‌కు వచ్చింది త్రిష. ఆమె మైకందుకుందో లేదో.. ఇక వ్యక్తిగత జీవితం మీద ప్రశ్నల మీద ప్రశ్నలు గుప్పించడానికి రెడీ అయిపోయారు మీడియా వాళ్లు. ఐతే వాళ్ల మనసుల్లో ఏముందో పసిగట్టేసిందో ఏమో.. రెండు ముక్కలు 'చీకటి రాజ్యం' గురించి మాట్లాడి చటుక్కున మైకు వేరే వాళ్లకు అప్పగించేసింది త్రిష. అప్పటికీ మీడియా ప్రతినిధులు ఎంగేజ్‌మెంట్‌ రద్దవడం గురించి అడుగుతూనే ఉన్నారు. ఏం పట్టనట్లు అక్కడి నుంచి లేచి వెళ్లిపోయింది త్రిష. మొత్తానికి త్రిష నోటి నుంచి ఆసక్తికర విషయాలు విందామనుకున్న వారికి నిరాశ తప్పలేదు.