Begin typing your search above and press return to search.
ఫొటోటాక్ః త్రిష మరింత అందంగా కనిపించేందుకు
By: Tupaki Desk | 17 July 2021 6:30 AM GMTసౌత్ లో సుదీర్ఘ కాలంగా హీరోయిన్ గా కొనసాగుతున్న ముద్దుగుమ్మ త్రిష. ఈమద్య కాలంలో కాస్త జోరు తగ్గినా కూడా లేడీ ఓరియంటెడ్ సినిమాలను వరుసగా తమిళంలో చేస్తున్న ఈ అమ్మడు తెలుగు లో కూడా అవకాశం వచ్చిన ప్రతి సారి నటిస్తూనే ఉంది. తెలుగు లో ఈమె దాదాపు అందరు స్టార్ హీరోలకు జోడీగా నటించింది. బాలీవుడ్ లో కూడా ఈమె కనిపించింది. నాలుగు పదుల వయసుకు చేరువ అయినా కూడా త్రిషకు వరుసగా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. హీరోయిన్ గా త్రిష కెరీర్ ఇంకా కంటిన్యూ అవ్వడానికి కారణంగా ఆమె ఫిట్ నెస్ మరియు ఆమె అందం కారణం అనడంలో సందేహం లేదు.
సాదారణంగా హీరోయిన్స్ మూడు పదుల వయసు కు వచ్చిన తర్వాత ఫిజిక్ విషయంలో ఎక్కువ శ్రద్ద పెట్టరు. కాని కొందరు మాత్రం నాలుగు కాదు అయిదు పదుల వయసులో కూడా అందంగా కనిపిస్తూ ఉంటారు. వారు ఫిజికల్ గా ప్రతి రోజు చాలా కష్టపడతారు. అందుకే వారు చాలా అందంగా కనిపిస్తారు. ఫిట్ నెస్ విషయంలో త్రిష చాలా కష్టపడుతుందనే విషయం తెల్సిందే. కెరీర్ ఆరంభం నుండి కూడా కంటిన్యూస్ గా వర్కౌట్స్ చేస్తూ ఉండే ఈ అమ్మడు ముందు ముందు మరింతగా పెద్ద సినిమాల్లో నటించేందుకు మరింత అందంగా కనిపించేందుకు గాను కొత్త జర్నీని మొదలు పెట్టింది.
సైక్లింగ్ వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఒక్క రైడ్ దూరంలో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. కనుక ప్రతి ఒక్కరు కూడా ఫిజికల్ ఫిట్ నెస్ కోసం సైక్లింగ్ చేయాలంటూ కొందరు చెబుతూ ఉంటారు. 38 ఏళ్ల వయసులో కూడా త్రిష తన ఆరోగ్య మరియు ఫిజిక్ గురించి దృష్టి పెట్టి కొత్తగా సైక్లింగ్ ను మొదలు పెట్టినట్లుగా ప్రకటించింది. సోషల్ మీడియాలో సైక్లింగ్ కోసం హెల్మెట్ మరియు మాస్క్ తో త్రిష రెడీ అయ్యింది. త్రిష ప్రతి రోజు సైక్లింగ్ తో మరింత అందంగా కనిపించేందుకు ప్రయత్నిస్తుంది అంటూ మీడియా వర్గాల వారు అంటున్నారు.
ఇక త్రిష ఈ వయసు లో కూడా సైక్లింగ్ కు సిద్దం అవ్వడం చూస్తుంటే ముచ్చటేస్తుంది. ఆమె కు ఫిజిక్ విషయంలో ఎంత శ్రద్ద ఉంటుందో.. ఆమెను చూసి చాలా మంది నేర్చుకోవాలి. ప్రతి రోజు ఖాళీగా కూర్చుని తింటే అనారోగ్యాలు వస్తాయి. అందుకే ప్రతి ఒక్కరు కూడా త్రిష మాదిరిగా సైక్లింగ్ లేదా మరో రకంగా అయినా ఫిజిక్ ను కాపాడుకోవాలంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.
త్రిష తెలుగు లో ఇంకా సినిమాలు చేయాలని కోరుకునే అభిమానులు చాలా మంది ఉన్నారు. హీరోయిన్ గా ఆమెను ఇంకా కోరుకునే వారు చాలా ఉన్నారు అనడంలో సందేహం లేదు. త్రిష ప్రస్తుతం కోలీవుడ్ సినిమా లకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తుంది. స్టార్ హీరోలకు సీనియర్ హీరోలకు జోడీగా నటించేందుకు ఈమెకు మరో అయిదు ఆరు ఏళ్లు అవకాశాలు రావచ్చు. ఇక వచ్చే ఏడాదికి ఈమె పెళ్లి చేసుకుంటుందనే తమిళ మీడియా వర్గాల వారు నమ్మకంగా చెబుతున్నారు. పెళ్లి తర్వాత కూడా త్రిష ఖచ్చితంగా సినిమాల్లో కొనసాగుతుందని అంతా నమ్మకంగా ఉన్నారు.