Begin typing your search above and press return to search.

త్రిష కామెడీ చేసింద‌ట‌

By:  Tupaki Desk   |   1 Feb 2016 3:30 PM GMT
త్రిష కామెడీ చేసింద‌ట‌
X
ఇదివ‌ర‌క‌టిలా గ్లామ‌ర్‌మంత్ర‌మే జ‌పిస్తామంటే త్రిష‌లాంటి క‌థానాయిక‌ల‌కి వ‌ర్క‌వుట్ అవ్వ‌దు. ఇటీవ‌ల లేలేత అందాలు తెర‌పైకొస్తున్నాయి. కుర్రాళ్లు వాళ్ల‌ని చూడ్డానికే ఇష్ట‌ప‌డుతున్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో త్రిష‌లాంటి ముదురు భామ‌లు మ‌రో దారిని చూసుకోవ‌ల్సిన అవ‌స‌రం త‌లెత్తుతుంది. ఆ విష‌యాన్ని త్రిష బాగానే గుర్తించింది. అందుకే గ్లామ‌ర్ని మాత్ర‌మే న‌మ్ముకోకుండా న‌ట‌న‌కు ప్రాధాన్య‌మున్న పాత్ర‌ల‌వైపు దృష్టిపెట్టింది. అదే స‌మ‌యంలో కొత్త భామ‌ల‌కి ఏమాత్రం త‌గ్గ‌కుండా గ్లామ‌ర్‌ గానూ క‌నిపించే ప్ర‌య‌త్నం చేస్తోంది. ఆ వ్యూహం త్రిష‌కి మంచి ఫ‌లితాల్నే ఇస్తోంది. కెరీర్ మొద‌లై పుష్క‌ర‌కాల‌మైనా ఇప్ప‌టికీ ఆమె దూసుకెళుతోందంటే కార‌ణం ఆమె వ్యూహాలే. గ‌తేడాది ఆరేడు సినిమాల్లో న‌టించి అద‌ర‌గొట్టిన త్రిష ఈ యేడాది కూడా అదే రేంజిలో అవ‌కాశాల్ని అందిపుచ్చుకొనాల‌ని భావిస్తోంది. తాజ‌గా ఆమె నాయ‌కి అనే చిత్రంలో న‌టిస్తోంది. తెలుగు - త‌మిళ భాష‌ల్లో రూపొందుతున్న ఈ చిత్రంలో త్రిష కామెడీ చేసింద‌ట‌. ఆ కామెడీని చూసి ప్ర‌తి ఒక్క‌రూ ప‌డీ ప‌డీ న‌వ్వుకొంటార‌ని చెప్పుకొచ్చింది. మొద‌ట్లో త్రిష ఈ సినిమాలో డ్యూయ‌ల్ రోల్‌ లో క‌నిపిస్తుంద‌ని ప్ర‌చారం సాగింది. కానీ త్రిష మాత్రం ఆ వార్త‌ల్ని తోసి పుచ్చింది. సింగిల్ క్యారెక్ట‌రే కానీ అందులో కొన్ని షేడ్స్ ఉంటాయ‌ని చెప్పుకొచ్చింది. క‌ళావ‌తితో ఇప్ప‌టికే విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకొన్న త్రిష నాయ‌కితోనూ అద‌ర‌గొడ‌తాన‌ని ఖ‌రాకండీగా చెబుతోంది. ఇటీవ‌ల ఆమె మీడియాతో మాట్లాడుతూ త‌న సినీ ప్ర‌యాణం గురించి, వ్య‌క్తిగ‌త విష‌యాల గురించి చాలానే చెప్పుకొచ్చింది. రానాతోఉన్న అనుబంధం గురించి ఆమె మ‌న‌సు విప్పింది. అంద‌రి క‌థానాయకుల్లాగే రానా కూడా ఓ మంచి స్నేహితుడ‌ని, అయితే ట్విట్ట‌ర్‌ లో మాత్రం చిత్రంగా మేం మాట్లాడుకొనే మాట‌లు వార్త‌ల్లోకి ఎక్కుతుంటాయి, అదెందుకో అర్థం కావ‌డం లేద‌ని చెప్పుకొచ్చింది. అయితే ప్రేమ‌ప‌క్షులుగా పేరు తెచ్చుకొన్న ఈ ఇద్ద‌రూ ఇటీవ‌ల ట్విట్ట‌ర్‌ లో ఒక‌రినొక‌రు ఫాలో అవ్వ‌డం మానేశారు. అదెందుకనేది అర్థం కావ‌డం లేదు.