Begin typing your search above and press return to search.

త్రిష వచ్చిందిగా.. నీకేమైంది?

By:  Tupaki Desk   |   10 April 2015 11:30 PM GMT
త్రిష వచ్చిందిగా.. నీకేమైంది?
X
చక్కగా ఫ్యాషన్‌గా ఓ చీరలాటి డ్రస్సును కట్టి.. డిజైనర్‌ ఛమక్కులన్నీ చూపించి.. పల్చటి పొరలోపల నుండి నడుం అందాలను యరవేస్తూ.. ఓ ఎలిసిపోయిన్‌ పింక్‌ రంగు డ్రస్‌లో ''లయన్‌'' ఆడియో ఫంక్షన్‌లో దుమ్ములేపేసింది త్రిష. అంతేనా.. అచ్చ తెలుగులో స్పీచ్‌ ఇచ్చేసింది కూడా.. ఇక హొయలను ఒలకబోస్తూనే బాలయ్య సార్‌కు నా థ్యాంక్స్‌ అంటూ నందమూరి అభిమానుల్లో జోష్‌ నింపేసింది. ఈమెను చూస్తే చాలామంది ఏం గుర్తొచ్చింది?

అసలు రక్తచరిత్ర వంటి సినిమా చేశాక తెలుగులో ఛాన్సే రాని రాధికా ఆప్టేకు పిలిచి లెజెండ్‌లో ఛాన్సిచ్చారు. మళ్ళీ పిలిచి లయన్‌లో ఛాన్సిచ్చారు. అయినాసరే అమ్మడు ఆడియో ఫంక్షన్‌కు రాలేదేంటి? ఇదండీ చాలామంది ప్రశ్న. నిజానికి టాలీవుడ్‌లో ఆడవారిని బాగా ట్రీట్‌ చేయరు అంటూ రాధిక కామెంట్లు చేసింది. ఆ లెక్కన చూస్తే స్టార్‌ హీరోయిన్‌ త్రిష ఆడియోకు వచ్చిందంటే ఆమెను బాగానే ట్రీట్‌ చేసినట్లేగా.. మరి రాధికను ఎందుకు సరిగ్గా చూసుకోలేదు. ఇదొక యాంగిల్‌ అయితే.. మనకు మరోటి కూడా వినిపిస్తోంది.

నిజానికి లయన్‌ సినిమాలో త్రిష కంటే ఎక్కువ గ్లామర్‌ రాధికా ఆప్టే ఆరబోసిందట. అయితే అమ్మడుకి పేమెంట్‌ పూర్తిగా ఇవ్వకుండా ఎగ్గొట్టడంతోనే ఇప్పుడు ఆడియోకు రాకుండా ఎగ్గొట్టి, కనీసం ట్విట్టర్‌లో కూడా ఒక్క చిన్న మాట కూడా పేల్చలేదు అమ్మడు. మరి బాలీవుడ్‌లో ఛాన్సులు చూసుకొని ఇంత ఓవర్‌ చేస్తోందా లేకపోతే నిర్మాత ఏడుపులు ఏడిపించడం వలనే చేస్తోంది తెలియదు.