Begin typing your search above and press return to search.

బ్యాంకాక్ లో త్రిషకు ట్రైనింగ్‌

By:  Tupaki Desk   |   15 Aug 2016 4:34 AM GMT
బ్యాంకాక్ లో త్రిషకు ట్రైనింగ్‌
X
చెన్నై బ్యూటీ త్రిషకి ఇప్పుడు హీరోయిన్ ఆఫర్స్ తగ్గిపోయాయి. అయితే కెరీర్ చివరి దశలో ఉందనే కామెంట్స్ మధ్యలో త్రిషకు హీరోయిన్ ఆఫర్స్ మాత్రం వరుసగా వస్తున్నాయి. ఇప్పటికే ఓ సారి నాయకి అంటూ జనాలను మెప్పించే ప్రయత్నం చేసింది కానీ.. ఆ సినిమా అంతగా క్లిక్ కాలేదు. దెయ్యంగా భయపెట్టేందుకు త్రిష బాగానే ప్రయత్నించింది కానీ.. ఆడియన్స్ మాత్రం భయపడలేదు సరికదా తిప్పికొట్టారు.

ఈ సారి మరింత జాగ్రత్తగా మరో లేడీ ఓరియెంటెడ్ మూవీ చేస్తోంది త్రిష. మోహిని అనే టైటిల్ పై రూపొందనున్న ఈ మూవీలో ఫైటింగులు కూడా చేసేయనుంది త్రిష. అలాగే బ్యాంకాంక్ లో కొన్ని యాక్షన్ సీన్స్ పిక్చరైజ్ చేయనుండగా.. వీటిలో ఫైటింగ్స్ స్వయంగా త్రిష చేయనుందట. ఇందుకోసం ఇప్పటికే ఈ భామ బ్యాంకాక్ వెళ్లిపోగా.. అక్కడ స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటోందని యూనిట్ వర్గాలు అంటున్నాయి. అలాగే పలు రోప్ సీన్స్ ను.. డూప్ లేకుండా స్వయంగా చేసేస్తానని చెప్పిందట త్రిష. వచ్చే వారం ఈ బ్యూటీ ట్రైనింగ్ పూర్తి కానుండడంతో.. ఆ వెంటనే షూటింగ్ ప్రారంభించేలా యూనిట్ బయల్దేరనుంది.

త్రిష ట్యాలెంట్ పై ఉన్న నమ్మకంతో నాయకి రిలీజ్ కి ముందే ఈ ఆఫర్ వచ్చింది. 'ఈ సినిమాను.. కేరక్టర్ ను త్రిష కోసమే రాసుకున్నాం. చాలా వరకు సన్నివేశాలను లండన్ లో తెరకెక్కించాం. అక్కడ ఓ పెద్ద బేకరీలో తీసిన సీన్స్ అనుకున్నదాని కంటే చాలా బాగా వచ్చాయి. ఇంకా కొన్ని ఫైటింగ్స్ సీన్స్ ను పిక్చరైజ్ చేయాల్సి ఉంది' అంటున్నాడు దర్శకుడు ఆర్ మాదేష్.