Begin typing your search above and press return to search.

అమ్మడి ముఖం వెయ్యి వాట్ల బల్బులా..

By:  Tupaki Desk   |   2 Nov 2016 4:07 AM GMT
అమ్మడి ముఖం వెయ్యి వాట్ల బల్బులా..
X
చెన్నై బ్యూటీ త్రిష హిట్ కొట్టి చాలా ఏళ్లు అయిపోయింది. రెండేళ్ల క్రితం కన్నడలో పవర్ (దూకుడు రీమేక్) మినహాయిస్తే గత ఐదారేళ్లలో ఈమెకు సరైన హిట్ ఒక్కటి కూడా రాలేదు. ఇక కెరీర్ క్లోజింగ్ అనుకునే టైమ్ లో వరుస ఆఫర్లతో స్పీడ్ చూపిస్తూ మళ్లీ బౌన్స్ బ్యాక్ అయింది త్రిష. ఇలాంటి టైమ్ లో ధనుష్ డ్యుయల్ రోల్ లో వచ్చిన కోలీవుడ్ మూవీ కోడి.. త్రిష కెరీర్ కి బిగ్ టర్నింగ్ అవుతోంది.

పొలిటికల్ థ్రిల్లర్ జోనర్ లో వచ్చిన కోడి లో.. త్రిష రోల్ చాలా ఇంపార్టెంట్. కథలో లీడ్ పాయింట్ కూడా ఈమె పాత్ర చుట్టూనే ఉంటుంది. సినిమాకి మంచి కలెక్షన్స్ రావడమే కాదు.. త్రిష కేరక్టర్ కు కూడా బోలెడంత పేరు వస్తోంది. అందుకే ఈ హిట్ ని ఏ యాంగిల్ నుంచి కూడా వదిలేందుకు త్రిష ఇష్టపడ్డం లేదు. ప్రమోషన్స్ లో కూడా మహా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తోంది చెన్నై బ్యూటీ. ఈ ప్రచారం సమయంలో చూస్తే.. అమ్మడి కళ్లలో కథలో ఇంపార్టెన్స్ తో వచ్చిన కళ స్పష్టంగా కనిపిస్తోంది. అమ్మడి ముఖం వెయ్యి వాట్ల బల్బులా వెలిగిపోతోంది.

కోడి తర్వాత కూడా అమ్మడి చేతిలో అరడజన్ సినిమాలు ఉన్నాయి. చతురంగ వేట్టై2 లో అరవింద్ స్వామితోను.. గర్జనై అనే చిత్రంలోను.. సామి2లో విక్రమ్ కి జోడీ గాను.. భోగి.. మోహినిలతో పాటు మరో చిత్రంలో త్రిష నటించేస్తోంది. ఈ ఆరింటిలో 2-3 హిట్ అయినా సరే.. త్రిష కెరీర్ మరో ఐదారేళ్లు కంటిన్యూ అయిపోవడం ఖాయం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/