Begin typing your search above and press return to search.

'జెర్సీ' తమిళ్ రీమేక్ లో స్టార్ హీరోయిన్...?

By:  Tupaki Desk   |   26 Aug 2020 1:30 PM GMT
జెర్సీ తమిళ్ రీమేక్ లో స్టార్ హీరోయిన్...?
X
నేచురల్ స్టార్ నాని - శ్రద్ధా శ్రీనాథ్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ''జెర్సీ''. క్రికెటర్ నేపథ్యంలో సాగే ఎమోషనల్ కథతో తెరకెక్కిన ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు. సితారా ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. గతేడాది సమ్మర్ లో విడుదలైన 'జెర్సీ' మంచి విజయాన్ని అందుకుంది. నాని - శ్రద్ధా శ్రీనాథ్ తమ నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. 'జెర్సీ' చిత్రం టొరంటో అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ కి సెలెక్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే కంటెంట్‌ బాగుంటే ఏ ఇండస్ట్రీలోనైనా మంచి ఆదరణ లభిస్తుందని భావించి ఈ చిత్రాన్ని తమిళ్ హిందీ భాషల్లో రీమేక్ చేయడానికి ముందుకొచ్చారు.

కాగా బాలీవుడ్ లో స్టార్ హీరో షాహిద్ క‌పూర్ తో 'జెర్సీ' చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ - దిల్‌ రాజు - సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇక తమిళ్ 'జెర్సీ' మూవీలో యంగ్ హీరో విష్ణు విశాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. అయితే విష్ణు విశాల్ కు జోడి ఎవరనే దానిపై రకరకాల వార్తలు వచ్చాయి. తెలుగు 'జెర్సీ'లో నటించిన శ్రద్ధా శ్రీనాథ్ ఇందులో కూడా నటించబోతుందని అనుకున్నారు. ఆ తర్వాత అమలా పాల్ మరోసారి విష్ణుతో జత కట్టబోతోందని న్యూస్ వచ్చింది. ఇప్పుడు లేటెస్టుగా స్టార్ హీరోయిన్ త్రిష‌ ఈ రీమేక్ లో నటిస్తోందని కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. త్రిష ప్రస్తుతం 'పారపాధమ్ విలయట్టు' 'గర్జనాని' 'పొన్నియన్ సెల్వన్' 'రాంగీ' 'షుగర్' 'రామ్' చిత్రాల్లో నటిస్తోంది. ఈ క్రమంలో తమిళ్ 'జెర్సీ'లో కూడా హీరోయిన్ గా నటించనుందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెలువడే అవకాశం ఉంది.