Begin typing your search above and press return to search.

అసలు చెవిలో ఆ మైక్‌ ఏంటి త్రిషా?

By:  Tupaki Desk   |   20 Aug 2015 1:34 AM IST
అసలు చెవిలో ఆ మైక్‌ ఏంటి త్రిషా?
X
త్రిష జెట్‌ స్పీడ్‌ తో దూసుకుపోతోంది. సినిమా తర్వాత సినిమా కాకుండా ఒకేసారి నాలుగైదు సినిమాల్లో నటించేస్తోంది. ఇప్పటికే ఆరణ్మయి - నాయకి - భోగి - వైట్‌ - భూలమ్‌ ఇన్ని సినిమాలు క్యూ లో ఉన్నాయి. అయితే వీటిలో ఆరణ్మయి రిలీజ్‌ కి రెడీగా ఉంది. మరో సినిమా నాయకి శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేసుకుంటోంది. ఆల్రెడీ తన ట్విట్టర్‌ పేజీ లో నాయకి ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ ని రిలీజ్‌ చేసిన విషయం తెలిసిందే.

ఆ పోస్టర్‌, దానిపై ట్యాగ్‌ లైన్‌ చూస్తుంటే శతకోటి అనుమానాలొస్తున్నాయి. పోస్టర్‌ పై చాలా ట్రెడిషనల్‌ గా చీరలో కనిపిస్తోంది. త్రిశూలం చేతపట్టుకుని కాళికను తలపిస్తోంది. సేమ్‌ టైమ్‌ మోడ్రన్‌ మాలక్ష్మిలా చెవిలో మైక్‌ పెట్టుకుని చండికలా కనిపిస్తోంది. 'షి వాచెస్‌ యు, షి క్యాచెస్‌ యు' అంటూ ట్యాగ్‌ లైన్‌ ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ లుక్‌ చూస్తుంటే అమ్మాయి రూపంలో ఉన్న అపరిచితురాలు అనాలనిపిస్తోంది. ఛండిక అవతారం ఎత్తిన జర్నలిస్టులా కనిపిస్తోంది. లేకపోతే ఆ చెవిలో మైక్‌ ఏంటండీ బాబూ?

నాయకి హారర్‌ కామెడీ చిత్రం. ప్రేమకథా చిత్రమ్‌, గీతాంజలి తరహాలో తెరకెక్కుతోంది అని డైరక్టర్‌ గోవి చెప్పుకొచ్చాడు. అయితే ఈ పోస్టర్‌ చూస్తే వెయ్యి సందేహాలొస్తున్నాయి. హారర్‌ సినిమాలో ఈ మైక్‌ పదే పదే కనిపిస్తుండటంతో, కట్టప్ప బాహుబలిని ఎందుకు చెప్పాడు అనే ప్రశ్న తరువాత త్రిష చెవిలో మైక్‌ ఎందుకు పెట్టుకుంది అనే ప్రశ్న ట్రెండింగ్‌ అయ్యేలా ఉంది.