Begin typing your search above and press return to search.

త్రిష ఆ పిచ్చి వదిలించుకుంటే బెటర్

By:  Tupaki Desk   |   7 Oct 2018 10:35 AM GMT
త్రిష ఆ పిచ్చి వదిలించుకుంటే బెటర్
X
హీరోయిన్ కు 30 ఏళ్లు వస్తే కెరీర్ క్లోజే అన్న అభిప్రాయాల్ని ఈ మధ్య చాలామంది హీరోయిన్లు మార్చివేశారు. నయనతార.. అనుష్క.. శ్రియ సరన్.. త్రిష లాంటి వాళ్లు 30 ప్లస్ తర్వాత కూడా మంచి మంచి అవకాశాలతో దూసుకెళ్లారు. ఐతే వీరిలో నయనతార.. అనుష్క లాంటి వాళ్లు హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలతోనూ సత్తా చాటారు. భారీ విజయాలందుకున్నారు.

వాళ్లను చూసి త్రిష సైతం ఆ తరహా సినిమలపై దృష్టిపెట్టింది. కానీ ఆ టైపు సినిమాలు చేసిన ప్రతిసారీ త్రిషకు చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి. ఆ మధ్య ‘నాయకి’ అనే సినిమా ఒకటి చేస్తే అది దారుణమైన ఫలితాన్నందుకుంది. ఆ తర్వాత ‘మోహిని’ అనే చిత్రం చేసింది. అదీ తుస్సుమంది. అయినా కూడా త్రిష ఆగట్లేదు. తాజాగా తనే ప్రధాన పాత్రలో మరో లేడీ ఓరియెంటెడ్ మూవీ మొదలుపెట్టింది. ఆల్రెడీ ఇంకో హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ కూడా సెట్స్ మీద ఉంది.

ఐతే త్రిష హీరోలతో కలిసి చేసే సినిమాలతోనే మంచి మంచి ఫలితాలు అందుకుంటోంది. రెండేళ్ల కిందట ధనుష్ హీరోగా వచ్చిన ‘కొడి’లో త్రిష నెగెటివ్ రోల్ లో మెరిసింది. ఆ సినిమా త్రిషకు మంచి పేరు తేవడమే కాక.. సక్సెస్ కూడా అందించింది. కానీ తర్వాతి రెండేళ్లలో ఆమెకు హిట్టే లేదు. ఇప్పుడు త్రిష.. విజయ్ సేతుపతి కలిసి నటించిన ‘96’ విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రంలో త్రిష నటనకూ ప్రశంసలు దక్కుతున్నాయి. ఓవైపు హీరోలతో కలిసి చేస్తున్న సినిమాలతో మంచి ఫలితాలందుకుంటూ.. ఇంకోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో ఎదురు దెబ్బలు తింటూనే ఉంది త్రిష. నయనతార.. అనుష్కల మాదిరి సినిమాల్ని నిలబెట్టే ఇమేజ్ త్రిషకు లేదు. ఆమెను ఆ కోణంలో జనాలు చూడరు. అలాంటపుడు వాళ్లను చూసి త్రిష వాత పెట్టుకోవడం ఎందుకో మరి?