Begin typing your search above and press return to search.

పెళ్లి పీటలు ఎక్కబోతున్న త్రిష… అందుకే అన్ని కోట్లతో

By:  Tupaki Desk   |   21 Jan 2023 6:30 AM GMT
పెళ్లి పీటలు ఎక్కబోతున్న త్రిష… అందుకే అన్ని కోట్లతో
X
సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ త్రిష ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి రెండు దశాబ్దాలు గడిచిపోతుంది. ఇన్నేళ్ళ కెరియర్ లో ఈ బ్యూటీ తెలుగు, తమిళంలో మెజారిటీ సినిమాలు చేసింది. కమర్షియల్ సినిమాల నుంచి స్ట్రాంగ్ కంటెంట్ ఉన్న ఫిమేల్ సెంట్రిక్ కథల వరకు అన్ని జోనర్స్ లో త్రిష సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సీనియర్ హీరోయిన్స్ జాబితాలో చేరిపోయిన త్రిష పొన్నియన్ సెల్వన్ సినిమాతో మరోసారి తాను ఎంత బెస్ట్ యాక్టర్ అనేది ప్రూవ్ చేసుకుంది. ఈ మూవీ తర్వాత తమిళంలో మళ్ళీ త్రిషకి సినిమా ఛాన్స్ లు పెరిగాయి.

ఈ నేపధ్యంలో లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ చేయబోయే సినిమాలో త్రిష లీడ్ రోల్ లో కనిపించబోతుంది. విజయ్ తో సుదీర్ఘ విరామం తర్వాత మరోసారి త్రిష జతకట్టబోతుంది. దీంతో పాటు ఫిమేల్ సెంట్రిక్ కథలకి కూడా ఈ బ్యూటీ గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. ఇదిలా ఉంటే ఈ బ్యూటీ చెన్నైలో ఏకంగా 35 కోట్లు పెట్టి ఇళయదళపతి ఇంటి పక్కన ఓ హౌస్ ని కొనుగోలు చేసింది. ఇంత ఖరీదైన బంగ్లాని త్రిష కొనుగోలు చేయడం ఇప్పుడు కోలీవుడ్ సర్కిల్ లో సంచలనంగా మారింది.

ఉన్నపళంగా ఇంత ఖరీదైన ఇంటిని త్రిష ఎందుకు కొనుగోలు చేసింది అనే ప్రశ్న ప్రతి ఒక్కరి నుంచి వినిపిస్తుంది. ఈ నేపధ్యంలో మరో టాక్ బయటకి వచ్చింది. త్రిష త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతుందని టాక్.

ప్రముఖ బిజినెస్ మెన్ తో త్రిష పెళ్లి జరగబోతుందనే ప్రచారం నడుస్తుంది. ఈ నేపధ్యంలో ఆమె చెన్నైలో విజయ్ ఇంటి దగ్గర ఈ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసిందని చెన్నై వర్గాలలో వినిపిస్తుంది.

గతంలో ఓ సారి త్రిష నిశ్చితార్ధం చేసుకొని పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది. అయితే పెళ్లి తర్వాత సినిమాలు వద్దని చెప్పడంతోనే అప్పుడు క్యాన్సిల్ చేసుకున్నట్లు టాక్. అయితే ఈ సారి తనఇండిపెండెంట్ కి ఎలాంటి భాగం కలిగించని వ్యక్తి ఆమె జీవితంలోకి రావడంతో పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తున్న మాట. ఈ ఏడాదిలోనే ఆమె పెళ్లి కచ్చితంగా జరిగే ఛాన్స్ ఉందని కూడా టాక్ నడుస్తుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.