Begin typing your search above and press return to search.

అఫీషియల్: కల నిజమైన వేళ

By:  Tupaki Desk   |   21 Aug 2018 5:29 AM GMT
అఫీషియల్: కల నిజమైన వేళ
X
అతడు సినిమాలో పూరి పాత్రలో ముద్దుముద్దుగా మహేష్ బాబు సరసన చిలిపి అల్లరి చేస్తూ మెప్పించిన త్రిషకు తెలుగు తమిళ భాషల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. తన కెరీర్ పీక్స్ లో ఉన్న టైంలో టాలీవుడ్ లో ఉన్న అగ్ర హీరోలందరి సరసన ఛాన్సులు కొట్టేసి చాలా కాలం టాప్ చైర్ లో కూర్చుంది. చిరంజీవి స్టాలిన్ తో మొదలుపెడితే ప్రభాస్ వర్షం దాకా సీనియర్ టు జూనియర్ అందరు స్టార్ హీరోలతో ఆడిపాడిన అరుదైన ఘనత తన సొంతం. అటు కోలీవుడ్ లోనూ అంతే. కానీ ఒక్క వెలితి మాత్రం చాలా కాలం నుంచి త్రిషను వెంటాడింది. అదే సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలో నటించడం.దీనికి సంబంధించి గత కొద్దిరోజులుగా త్రిష అందులో సెలెక్ట్ అయినట్టుగా వార్తలు వచ్చాయి కానీ అఫీషియల్ గా కన్ఫర్మేషన్ లేకపోవడంతో కొంత సందేహం నెలకొంది.

వాటికి పూర్తిగా చెక్ పెడుతూ ప్రకటన వచ్చేసింది. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రజని నటిస్తున్న 165వ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా త్రిష ఎంపికను ఖరారు చేస్తూ సన్ పిక్చర్స్ అధికారిక ప్రకటన కూడా జారీ చేసింది. ఇది త్రిషకే కాదు తన ఫ్యాన్స్ కు సైతం బంపర్ న్యూస్. కాకపోతే ఇన్ సైడ్ టాక్ ప్రకారం త్రిష రోల్ లో నెగటివ్ షేడ్స్ ఉంటాయట. అచ్చం నరసింహలో రమ్యకృష్ణ పోషించిన నీలాంబరి తరహాలో. అదే నిజమైనా దిగులు అక్కర్లేదు. ఎందుకంటే హీరోయిన్ కన్నా ఎన్నో రేట్లు ఎక్కువ పేరు అవి తీసుకొస్తాయి. ఎలాగూ చెట్లు పుట్ల వెంట డ్యూయెట్స్ పాడే కథలు చేయను అని రజని తేల్చి చెప్పిన నేపధ్యంతో అతనితో సై అంటే సై అంటూ సవాల్ విసిరే పాత్రలే మంచి స్కోప్ ఇస్తాయి. మరో హీరోయిన్ గా ఇంతకు ముందే సిమ్రాన్ సెలక్షన్ జరిగిపోయింది.

విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్న ఈ మూవీలో ఫాదర్ సెంటిమెంట్ ఎక్కువగా ఉంటుందట. ఇంత పెద్ద స్టార్ ను డీల్ చేస్తున్న కార్తీక్ సుబ్బా రాజ్ పైనే అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. ఇటీవలే ఇతను తీసిన సైలెంట్ హారర్ మూవీ మెర్క్యూరీ కమర్షియల్ గా మెప్పించలేదు కాని టెక్నికల్ గా ప్రశంశలు దక్కించుకుంది. వచ్చే సమ్మర్ కు విడుదల ప్లాన్ చేసిన ఈ మూవీ టైటిల్ డిసెంబర్ 12న రజని పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ తో సహా ప్రకటిస్తారు.