Begin typing your search above and press return to search.

చిరును కాద‌ని బాల‌య్యకు ఓకే చెప్పింది!

By:  Tupaki Desk   |   30 Aug 2021 5:04 AM GMT
చిరును కాద‌ని బాల‌య్యకు ఓకే చెప్పింది!
X
న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ క‌థానాయ‌కుడిగా బోయ‌పాటి అఖండ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ కాంబినేష‌న్ సింహా- లెజెండ్ త‌ర్వాత హ్యాట్రిక్ హిట్ కోసం స‌ర్వ‌శ‌క్తుల్ని ఒడ్డుతోంది. త‌దుప‌రి క్రాక్ ఫేం గోపిచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో న‌టించేందుకు బాల‌య్య బాబు ఆస‌క్తిగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకి ప్రీప్రొడ‌క్ష‌న్ ప‌నులు స‌హా కాస్టింగ్ ఎంపిక‌లు పూర్త‌వుతున్నాయి.

తాజా స‌మాచారం మేర‌కు ఈ చిత్రంలో త్రిష క‌థానాయిక‌గా ఫైన‌ల్ అయ్యింద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. క్రాక్ త‌ర్వాత మ‌రోసారి సీరియస్ కాప్ యాక్ష‌న్ డ్రామా క‌థాంశాన్ని రెడీ చేసిన మ‌లినేని అత్యంత భారీ బడ్జెట్ తో తెర‌కెక్కించేందుకు ప్లాన్ చేశారు. ఇందులో త్రిష గృహిణిగా కనిపిస్తుందని తెలిసింది.

నిజానికి నాయ‌కి త‌ర్వాత త్రిషకు తెలుగులో సినిమా లేదు. పూర్తిగా త‌మిళంలోనే న‌టిస్తోంది. ఇంత‌లోనే మెగాస్టార్ చిరంజీవి స‌ర‌స‌న కొర‌టాల ఆచార్య‌లో ఆఫ‌ర్ ఇచ్చినా క్రియేటివ్ డిఫ‌రెన్సెస్ తో వైదొల‌గింద‌ని టాక్ వినిపించింది. కానీ ఇప్పుడు మ‌లినేని ఆఫ‌ర్ ని త్రిష కాద‌న‌లేక‌పోయింద‌ట‌. అప్పుడు చిరుతో ఆఫ‌ర్ వ‌దులుకున్నా ఇప్పుడు బాల‌య్య తో అవ‌కాశాన్ని వ‌దులుకునేందుకు ఇష్ట‌ప‌డ‌లేద‌ట‌. బాల‌య్య స‌ర‌స‌న ఇంత‌కుముందు 2015 యాక్షన్ డ్రామా `లయన్‌`లో త్రిష స్క్రీన్ స్పేస్ ను పంచుకున్నారు. 6 సంవత్సరాల తర్వాత ఈ జంట తిరిగి క‌లుస్తోంది. బాల‌య్య‌- త్రిష జోడీని ఇన్నాళ్లికి తిరిగి చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తారనడంలో సందేహ‌మేం లేదు.

కొన్ని సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్ లో జరిగిన యదార్థ ఘటనల నుండి స్ఫూర్తి పొంది గోపీచంద్ మలినేని స్క్రిప్ట్ ని రాశారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ నిర్మిస్తోంది. మరిన్ని వివరాలు వెల్ల‌డి కావాల్సి ఉంది.

బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో అసాధార‌ణ లైన‌ప్

లెజెండ్ చిత్రీక‌ర‌ణ పూర్త‌వ్వ‌గానే గోపిచంద్ మ‌లినేనితో సినిమా మొద‌ల‌వుతుంది. ఇది బాల‌య్య న‌టించే 107వ సినిమా. త‌దుప‌రి బాల‌య్య 108వ చిత్రానికి ప‌ని న‌డుస్తోంది. `ప‌టాస్`- `ఎఫ్-2`- `స‌రిలేరు నీకెవ్వురు` చిత్రాల‌తో బ్లాక్ బ్ల‌స్ట‌ర్ అందుకున్న అనీల్ రావిపూడి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న‌ట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్ప‌టికే బాల‌య్య కు లైన్ వినిపించి లాక్ చేసిన‌ట్లు స‌మాచారం.

బాల‌య్య ఇమేజ్ కు త‌గ్గ‌ట్టు మాస్ అంశాలున్న క‌థ‌లోనే త‌న‌దైన శైలి కామెడీ ని హైలైట్ చేస్తూ అనీల్ రావిపూడి స‌రికొత్త‌ ఎంటర్ టైనర్ ని రూపొందిస్తార‌ని తెలిసింది. ఇది బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధం కావాల్సి ఉంది. అయితే బాల‌య్య అభిమానుల‌ను మెప్పించే మాసీ కామెడీ ట్రీట్ ని రెడీ చేయాల‌ని భావిస్తున్న‌ట్టు టాక్ వినిపిస్తోంది. వాస్త‌వానికి ఈ కాంబినేష‌న్ లో సినిమా ఇప్ప‌టికే సెట్స్ పైకి వెళ్లాల్సి ఉండ‌గా ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో ఆల‌స్య‌మైంది. బాల‌కృష్ణ‌- అనీల్ తో సినిమాని సాహు గార‌పాటి- హ‌రీష్ పెద్ది సంయుక్తంగా షైన్ స్క్రీన్ బ్యాన‌ర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తార‌ని స‌మాచారం.

`పైసా వ‌సూల్` త‌ర్వాత పూరి కూడా ఎన్బీకేతో మ‌రో సినిమా చేయాల్సి ఉండ‌గా అత‌డు ఇప్ప‌టికే స్క్రిప్ట్ రెడీ చేసే ప‌నిలో ఉన్నాడ‌ని ప్ర‌చార‌మ‌వుతోంది. ఎన్.బి.కె 109 మాత్రం పైసా వసూల్ ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్ తో ఉంటుంద‌ని ఇంత‌కుముందు బాల‌య్య క‌న్ఫామ్ చేశారు. ఆస‌క్తిక‌రంగా ఆదిత్య 369 సీక్వెల్లోనూ బాల‌య్య న‌టిస్తారు. అందులో మోక్ష‌జ్ఞ క‌థానాయ‌కుడు కాగా బాల‌య్య ద్విపాత్రాభిన‌యం చేయ‌నున్నారు. బ‌హుశా ఈ చిత్రం మోక్ష‌జ్ఞ‌కు మొద‌టి చిత్రం కాగా.. ఎన్బీకే 110వ చిత్రం అవుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఆదిత్య 369 చిత్రం ఈ ఏడాదితో 30సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా బాల‌కృష్ణ స్వ‌యంగా క్రేజీ సీక్వెల్ ని కన్ఫామ్ చేశారు. ఎన్బీకే వ‌రుస‌గా ముగ్గురు ద‌ర్శ‌కుల‌ను ఫైన‌ల్ చేయ‌గా ఆదిత్య 369 సీక్వెల్ కి ద‌ర్శ‌కుడిని ఫైన‌ల్ చేయాల్సి ఉంది.