Begin typing your search above and press return to search.

ఇంకా సరైనోడి కోసమే వెయిటింగ్‌

By:  Tupaki Desk   |   17 March 2019 7:47 AM GMT
ఇంకా సరైనోడి కోసమే వెయిటింగ్‌
X
టాలీవుడ్‌ మరియు కోలీవుడ్‌ లో పుష్కర కాలం పాటు స్టార్‌ హీరోయిన్‌ గా వెలుగు వెలిగిన ముద్దుగుమ్మ త్రిష ప్రస్తుతం ఆశించిన స్థాయిలో ఆఫర్లు రావడం లేదు. హీరోల సరసన నటించే అవకాశాలు రాకపోవడంతో లేడీ ఓరియంటెడ్‌ చిత్రాలకు సైతం గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తోంది. ఈ అమ్మడు తాజాగా రజినీకాంత్‌ తో పెట్ట సినిమాలో నటించింది. ఆ సినిమా పర్వాలేదు అనిపించినా కూడా త్రిషకు పెద్దగా ఆ సినిమా మైలేజ్‌ ను తీసుకు రాలేక పోయింది. దాంతో ఈ అమ్మడి మనసు పెళ్లి పైకి మళ్లీనట్లుగా అనిపిస్తుంది.

కొన్నాళ్ల క్రితమే త్రిష పెళ్లి జరగాల్సి ఉంది. వరుణ్‌ మణియన్‌ అనే నిర్మాత కం వ్యాపారవేత్తతో ఈ అమ్మడి వివాహ నిశ్చితార్థం కూడా అయ్యింది. అయితే కారణం ఏంటో తెలియదు కాని వారి బంధం నిశ్చితార్థంతోనే ముగిసి పోయింది. పెళ్లి క్యాన్సిల్‌ అవ్వడంతో హీరోయిన్‌ గా మళ్లీ బిజీ అయ్యేందుకు త్రిష ప్రయత్నించింది. అదే సమయంలో రానాతో ఈ అమ్మడి ప్రేమ వ్యవహారంలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. వీరిద్దరు పెళ్లి చేసుకుంటారని కూడా వార్తలు వచ్చాయి. అయితే త్రిష మాత్రం రానాతో పెళ్లి వార్తలను కొట్టి పారేస్తోంది.

తాజాగా మరోసారి పెళ్లి గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... తనకు భారత పెళ్లి సాంప్రదాయంపై పూర్తి నమ్మకం ఉందని, తప్పకుండా పెళ్లి చేసుకుంటాను అంటూ చెప్పుకొచ్చింది. ఖచ్చితంగా ప్రేమ వివాహం చేసుకుంటాను అంటూ ప్రకటించిన త్రిష ఇప్పటి వరకు తన మనసుకు నచ్చిన వాడు, నాకు సరైనోడు దొరకలేదని, ఆ సరైనోడి కోసం వెయిటింగ్‌ అంటూ ప్రకటించింది. ఇంత మంది త్రిషకు తారస పడ్డారు, ఎంతో మందితో త్రిష స్నేహం చేసింది. అయినా కూడా వారిలో ఎవరు కూడా త్రిషకు సరైనోడు అనిపించక పోవడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇంతకు త్రిషకు సరైనోడు ఏ రాష్ట్రంలో ఉన్నాడో..!