Begin typing your search above and press return to search.

20యేళ్ల సినీ కెరీర్.. తరగని గ్లామర్ ఆమె సొంతం!

By:  Tupaki Desk   |   4 May 2020 9:37 AM GMT
20యేళ్ల సినీ కెరీర్.. తరగని గ్లామర్ ఆమె సొంతం!
X
ఈరోజు సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ త్రిష పుట్టినరోజు. 1983 సంవత్సరం సరిగ్గా ఇదే తేదీన జన్మించి ఈ రోజు 37వ సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. ఈ సందర్భంగా ఆమె అభిమానులతో పాటు సెలబ్రిటీలంతా సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. దాదాపు త్రిష ఇండస్ట్రీకి పరిచయమై 20ఏళ్ళు పూర్తవుతోంది. ఇన్నేళ్ల జర్నీలో ఎన్నో ఎత్తు పల్లాలను ఎదుర్కొన్నారామె. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన త్రిష.. తల్లి సహకారంతో మోడలింగ్ రంగంలోకి ప్రవేశించి.. తమిళ సినిమా 'జోడీ'తో వెండితెరపై అడుగుపెట్టింది. తెలుగులో 'నీ మనసు నాకు తెలుసు' సినిమాతో పరిచయమై అందం అభినయంతో వరుస అవకాశాలు దక్కించుకొని స్టార్ హీరోలందరి సరసన నటించింది. ఇక ప్రభాస్‌తో నటించిన 'వర్షం' మూవీ ఆమె కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచింది.

ఇటు కుర్ర హీరోలు, అటు వెటరన్ స్టార్స్‌ చిరంజీవి, వెంకటేష్, రజినీకాంత్, బాలకృష్ణ, నాగార్జున లాంటి వారితో రొమాన్స్ చేసి రెండు తరాల హీరోయిన్‌గా భారీ క్రేజ్ కొట్టేసింది త్రిష. అప్పట్లో భారీ రెమ్యూనరేషన్ తీసుకుని సెన్సేషన్ క్రియేట్ చేసిన హీరోయిన్ కూడా త్రిషనే. దాదాపు ఇరవై ఏళ్లుగా తెలుగు, తమిళ భాషల్లోని సినిమాల్లో తనదైన ప్రత్యేకత కలిగిన త్రిష జీవితంలో మరచిపోలేని సంఘటనలు కూడా ఉన్నాయి. గతంలో ప్రభాస్, రానాలతో ప్రేమ అనే పుకార్లు. సడన్ గా పెళ్లి క్యాన్సిల్ కావడం ఆమె లైఫ్‌ లో మర్చిపోలేని సంఘటనలుగా మిగిలాయి. 2015 సంవత్సరం తమిళ నిర్మాత వరుణ్ మనియన్‌ తో త్రిష వివాహం ఖరారైంది. అప్పట్లో నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగింది.


ఇక ఈ మధ్య తెలుగు సినిమాలకు దూరమై కేవలం తమిళ సినిమాలే చేస్తోంది త్రిష. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి సరసన ‘ఆచార్య’ సినిమాలో ఛాన్స్ వచ్చినా వదులుకుంది. దీంతో మెగా అభిమానులు కొంత నిరాశ చెంది ఆమెపై కామెంట్స్ చేశారు. అయితే తాజాగా రవితేజ సరసన ఛాన్స్ కొట్టేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఓ హీరోయిన్ 20 ఏళ్ల పాటు వన్నెతగ్గని గ్లామర్ మెయింటేన్ చేయడం త్రిషకే దక్కింది. కెరీర్‌ లో మళ్లీ రెట్టింపు ఉత్సాహంతో అభిమానులను అలరించాలని కోరుకుంటూ.. తుపాకీ మీడియా తరపున శుభాకాంక్షలు తెలుపుతున్నాము.