Begin typing your search above and press return to search.
తెలుగు తెరపైకి దరిద్రపుగొట్టు లవ్ స్టోరీ
By: Tupaki Desk | 2 Nov 2015 10:38 AM GMTఇన్నాళ్లు చాలా రకాల ప్రచారాలు చూశాం. ఇలాంటి ప్రమోషన్ మాత్రం ఇదే మొదలు. ‘తెలుగు సినిమా చరిత్రలోనే ఇది పరమ చెత్త దరిద్రపుగొట్టు లవ్ స్టోరీ’ అనే ట్యాగ్ ను ఓ సినిమా సినిమా పోస్టర్ మీద వేసుకోవడం ఎప్పుడైనా చూశామా? తమిళ డబ్బింగ్ మూవీ ‘త్రిష లేదా నయనతార’ పోస్టర్ మీద ఈ ట్యాగ్ లైనే కనిపిస్తోంది. మామూలుగా వస్తే జనాలకు పట్టదనుకున్నారేమో.. ఇలాంటి దిగజారుడు ట్యాగ్ లైన్ ఒకటి తగిలించుకుని వస్తున్నారు. ఈ నెల 5న ఈ సినిమా తెలుగులో విడుదల కాబోతోంది.
తమిళంలో రెండు నెలల కిందటే విడుదలై సంచలన విజయం సాధించిందీ సినిమా. బాలీవుడ్ లో వచ్చే అడల్ట్ కామెడీ టైపు సినిమా ఇది. తమిళ ప్రేక్షకులకు ఈ సినిమా కొత్తగా అనిపించింది. ట్రైలర్లోని బూతు మాటలు, బూతు సన్నివేశాలు చూసి.. యూత్ కు ఈ సినిమా మీద బాగానే ఆసక్తి కలిగింది. హీరో జి.వి.ప్రకాష్ కుమార్ చేసింది ఒక్క సినిమానే అయినా దీనికి భారీగా ఓపెనింగ్స్ వచ్చాయి. టాక్ ఏవరేజ్ అని వినిపించినప్పటికీ.. యూత్ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. కేవలం రూ.5 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా రూ.20 కోట్ల దాకా వసూలు చేసి.. సంచలనం సృష్టించింది. అదే ఊపులో తెలుగు బాక్సాఫీస్ ను కూడా ఏలేద్దామని వస్తోంది. మన తెలుగమ్మాయి ఆనంది తో పాటు మనీషా యాదవ్ ఓ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సిమ్రాన్ గెస్ట్ రోల్ చేయడం విశేషం. ఆదిక్ రవిచంద్రన్ దర్శకుడు.