Begin typing your search above and press return to search.
సినిమా రివ్యూ : త్రిష లేదా నయనతార
By: Tupaki Desk | 5 Nov 2015 12:32 PM GMTచిత్రం : త్రిష లేదా నయనతార
నటీనటులు- జి.వి.ప్రకాష్ కుమార్ - ఆనంది (రక్షిత) - మనీషా యాదవ్ - సిమ్రాన్ తదితరులు
సంగీతం- జి.వి.ప్రకాష్ కుమార్
ఛాయాగ్రహణం- రిచర్డ్ నాథన్
మాటలు- శశాంక్ వెన్నెలకంటి
నిర్మాణం- రిషి మీడియా
కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం- ఆధిక్ రవిచంద్రన్
తెలుగు సినిమా చరిత్రలోనే పరమ దరిద్రపుగొట్టు లవ్ స్టోరీ.. అంటూ చిత్రమైన ప్రమోషన్ తో తెలుగులోకి వచ్చిన తమిళ డబ్బింగ్ సినిమా ‘త్రిష లేదా నయనతార’. సంగీత దర్శకుడు జి.వి.ప్రకాష్ కుమార్ హీరోగా, మన తెలుగమ్మాయి ఆనంది హీరోయిన్ గా నటించిన ఈ అడల్ట్ కామెడీ.. తమిళ నాట మంచి విజయమే సాధించింది. ఈ రోజే తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా విశేషాలేంటో చూద్దాం పదండి.
కథ:
తనతో పాటు ఒకే హాస్పిటల్లో పుట్టిన రమ్య (ఆనంది), అదితి (మనీషా యాదవ్)లతో జీవా (జి.వి.ప్రకాష్ కుమార్) అనే కుర్రాడు ఆడే సయ్యాటల నేపథ్యంలో సాగే కథ ఇది. ముందు అతను రమ్య ప్రేమలో పడతాడు. ఆమె కూడా అతణ్ని ప్రేమిస్తుంది. ఐతే జీవా చేసిన ఓ తప్పుతో అతణ్ని చీకొట్టి వెళ్లిపోతుందది రమ్య.అదే సమయంలో అదితి అతడికి ఐలవ్యూ చెబుతుంది. ఐతే కొన్నాళ్ల తర్వాత ఆమె కూడా అతణ్ని వదిలేస్తుంది. ఈ పరిస్థితుల్లో మళ్లీ అతడికి రమ్య తారసపడుతుంది. తిరిగి ఆమె ప్రేమను గెలుచుకోవడానికి జీవా ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? చివరికి వాళ్లిద్దరూ ఒక్కటయ్యారా లేదా అన్నది మిగతా కథ.
కథనం - విశ్లేషణ:
‘త్రిష లేదా నయనతార’ సినిమా చూస్తున్నంతసేపూ ఈ సినిమా నిజంగానే తమిళంలో రూ.20 కోట్ల వసూళ్లు అన్న సందేహం కలగడం ఖాయం. ఎందుకంటే అంతగా ప్రేక్షకులు ఎగబడి చూసేంత ‘మేటర్’ ఇందులో ఏమీ లేదు. బహుశా తమిళ ప్రేక్షకులకు అడల్ట్ కామెడీ అనేది పెద్దగా పరిచయం లేని జానర్ కావడం వల్ల ఈ సినిమా ఎగబడి చూసి ఉండొచ్చేమో.
కానీ గత కొన్నేళ్లలో మారుతి బ్రాండు సినిమాలు లెక్కలేనన్ని చూసిన తెలుగు ప్రేక్షకులకు ‘త్రిష లేదా నయనతార’ అంత ప్రత్యేకంగా ఏమీ అనిపించదు. దీనికంటే ఎక్కువ డోస్ ఉన్న అడల్ట్ కామెడీలు మనం చాలానే చూశాం. ఇందులో హీరోయిన్ గా నటించిన ఆనందిని చూస్తే.. ఆమె తెలుగులో చేసిన ‘బస్ స్టాప్’ సినిమా గుర్తుకు రాకమానదు. ఆ సినిమాలో మనం చూడని అడల్ట్ కామెడీనా.. బూతు జోకులా? వాటి ముందు ‘త్రిష లేదా నయనతార’లో వచ్చే జోకులు, సన్నివేశాలు మన ప్రేక్షకులు చాలా మామూలుగా అనిపిస్తాయి.
అప్పుడెప్పుడో ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’లోని ఓ పాటలో చిరు ‘ఆ మరుసటి రోజు మా వీధిలోకి ఐశ్వర్య వచ్చింది’ అంటాడు కదా. ఆ కాన్సెప్ట్ లో సాగే సినిమా ఇది. ఈ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి అన్న ధోరణిలో సాగుతాయి కథాకథనాలు. చివర్లో కూడా అదే సందేశం ఇచ్చారు. ఉండటానికి ఇందులో హీరోకు రెండు లవ్ స్టోరీలు ఉన్నాయి కానీ.. ఏదీ గొప్పగా ఏమీ లేదు. ఫస్ట్ లవ్ స్టోరీలో కొంచెం ఫీల్ ఉన్నట్లు, బాగానే సాగుతున్నట్లు అనిపిస్తుంది కానీ.. దాన్ని సడెన్ గా బ్రేక్ చేసేసి.. రెండో లవ్ స్టోరీని తెచ్చారు. అది పూర్తిగా అడల్ట్ కామెడీ మీద నడిచే స్టోరీ. కొన్ని అడల్ట్ జోకులు పర్వాలేదనిపిస్తాయి కానీ.. పగలబడి నవ్వేలా అయితే లేవు. ఈ స్టోరీని చాలా సిల్లీగా ముగించారు.
అమ్మాయిలు-మందు అనే కాన్సెప్ట్ మీద హీరో వల్లించే వేదాంతం చిత్రంగా ఉంటుంది. అది చూస్తే... ‘మద్యం అమ్మాయిలకు మాత్రమే హానికరం’ అని మొదట్లో ట్యాగ్ వేయాల్సిందేమో అనిపించేలా ఉంటుంది. సినిమాలో హీరో ఎన్నిసార్లు మందు కొడతాడో లెక్కే ఉండదు. కానీ అబ్బాయిలు మందు కొడితే తప్పేం లేదు.. లేడీస్ తాగితేనే ప్రమాదం అని లెక్చర్ దంచుతాడు. సెకండాఫ్ లో మళ్లీ తన పాత లవ్ స్టోరీని పండించుకునే ప్రయత్నం చేస్తాడు హీరో. ఈ సన్నివేశాలు కూడా గొప్పగా ఏమీ లేవు.
దర్శకుడు కథాకథనాల మీద పెద్దగా దృష్టిపెట్టలేదు. కేవలం అడల్ట్ కామెడీ మీద, జోకుల మీద బండి లాగించేద్దామని చూశాడు. కాకపోతే తమిళ ప్రేక్షకులు ఆ కామెడీకి తెగ నవ్వేశారేమో కానీ.. మనోళ్లకు ఈ డోస్ సరిపోదు. ఇప్పటికే దీని బాబు లాంటి అడల్ట్ కామెడీలు చూసిన మనోళ్లకు ‘త్రిష లేదా నయనతార’లో ఏ విశేషం కనిపించదు. తక్కువ నిడివి ఉండటం, మరీ బోర్ కొట్టకుండా సాగిపోవడం.. సంగీతం బాగుండటం దీనికి ప్లస్ అయ్యే అంశాలు.
నటీనటులు:
టీనేజీలో అమ్మాయిల కోసం తహతహలాడిపోయే టీనేజీ కుర్రాడి పాత్రలో జి.వి.ప్రకాష్ కుమార్ పర్వాలేదు. అతడి ఫిజిక్ వేర్వేరు వయసుల్లో కనిపించడానికి బాగా ఉపయోగపడింది. స్కూలు పిల్లాడిగా, ఆ తర్వాత వయసొచ్చిన కుర్రాడిగా వేరియేషన్ బాగానే చూపించాడు. ఐతే ప్రతి సన్నివేశంలోనూ చిరాగ్గా ఫేస్ పెట్టమని డైరెక్టర్ అతడికి చెప్పాడో ఏమో.. సినిమా అంతా అలాగే కనిపించాడు. తమిళంలో ఆనందిగా పేరు మార్చుకుని రాణిస్తున్న తెలుగమ్మాయి రక్షిత సినిమాకు ప్రధాన ఆకర్షణ. ఆమె తన అందంతో, అభినయంతో ఆకట్టుకుంది. తన కళ్లు కట్టిపడేస్తాయి. ఈ సినిమా చూశాక.. రక్షిత టాలెంట్ మనం వాడుకోవట్లేదేమో అనిపిస్తుంది. మరో హీరోయిన్ మనీషా యాదవ్ బాగానే స్కిన్ షో చేసింది కానీ.. ఆమె అంత అందంగా లేదు, హీరోయిన్ అన్న ఫీలింగ్ ఇవ్వదు. చాన్నాళ్ల తర్వాత గెస్ట్ రోల్ చేసిన సిమ్రాన్ బాగానే చేసింది. ఐతే పూర్తిగా గ్లామర్ కోల్పోయిన సిమ్రాన్ ను చూడటం ఆమె అభిమానులకు కొంచెం కష్టమే.
సాంకేతిక వర్గం:
టెక్నీషియన్స్ అందరూ మంచి ఔట్ పుటే ఇచ్చారు. జి.వి.ప్రకాష్ కుమార్ నేపథ్య సంగీతం సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్. లవ్ సీన్స్ లో చక్కటి బ్యాగ్రౌండ్ స్కోర్ తో తన ప్రత్యేకత చూపించాడు జి.వి. పాటలు కూడా బాగానే ఉన్నాయి. హీరో హీరోయిన్ల మధ్య వచ్చే మెలోడీ బాగా ఆకట్టుకుంటుంది. తెలుగు లిరిక్స్ మరీ ఇబ్బందికరంగా ఏమీ లేవు. కొంచెం శ్రద్ధ పెట్టి రాయించినట్లున్నారు. శశాంక్ వెన్నెలకంటి చాలా వరకు తమిళ డైలాగుల్నే దించాడు కానీ.. కొన్నిచోట్ల తమిళ ఫ్లేవర్ ఉన్న డైలాగుల్ని బాగానే తెలుగీకరించాడు. డైరెక్టర్ ఆధిక్ రవిచంద్రన్ కు ఇది తొలి సినిమా. ఈ కాలం యూత్ ఎలా ఉన్నారన్న విషయంలో అతడికి బాగానే క్లారిటీ ఉంది. వాళ్ల టేస్టుకు తగ్గ కామెడీ అందించే ప్రయత్నం చేశాడతను. కొన్ని సన్నివేశాల వరకు పనితనం చూపించాడు కానీ.. కథాకథానాల్ని సరిగా తీర్చిదిద్దడంలో ఫెయిలయ్యాడు.
చివరగా- ఈ అడల్ట్ కామెడీ.. మనకు ఆనదు.
రేటింగ్- 2/5
Disclaimer : This Review is An Opinion of Review Writer. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre