Begin typing your search above and press return to search.

గుస‌గుస‌: బిజినెస్ మేన్ తో త్రిష పెళ్లి?

By:  Tupaki Desk   |   3 May 2021 6:30 AM GMT
గుస‌గుస‌: బిజినెస్ మేన్ తో త్రిష పెళ్లి?
X
తెలుగు-త‌మిళ ప‌రిశ్ర‌మ‌ల్లో రెండు ద‌శాబ్ధాల పాటు స్టార్ డ‌మ్ ని కొన‌సాగించిన త్రిష ఇంత‌కుముందు బిజినెస్ మేన్ వ‌రుణ్ మ‌ణియ‌న్ ని పెళ్లాడేందుకు సిద్ధ‌మైన సంగ‌తి తెలిసిందే. కానీ ఆ పెళ్లి ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో నిశ్చితార్థం త‌ర్వాత ఆగిపోవ‌డం త‌న అభిమానుల్ని బాధ‌కు గురి చేసింది.

ఆ త‌ర్వాత త్రిష పెళ్లి ఊసే ఎత్త‌లేదు. కానీ అప్పుడ‌ప్పుడు త‌న పెళ్లి గురించిన‌ ర‌క‌ర‌కాల క‌థ‌నాలు వ‌స్తూనే ఉన్నాయి. హీరో శింబును త్రిష పెళ్లాడ‌తార‌ని కూడా ఇటీవ‌ల వార్త‌లు వ‌చ్చాయి. కానీ అవేవీ నిజాలు కాలేదు. తెలుగు హీరో రానాతో ప్రేమాయ‌ణం అంటూ సాగిన పుకార్ల‌కు రానా.. త్రిష క్లారిటీ ఇచ్చారు. తాము స్నేహితులం మాత్ర‌మేన‌ని ప‌లుమార్లు తెలిపారు.

తాజాగా ఓ ప్ర‌ముఖ బిజినెస్ మేన్ ని పెళ్లాడేందుకు త్రిష సిద్ధ‌మ‌వుతున్నార‌ని కోలీవుడ్ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది. అయితే అత‌డు ఎవ‌రు.. ఎక్క‌డ ఉంటారు? అన్న‌దానిపై స‌రైన క్లారిటీ లేదు. త్రిష వైపు నుంచి అధికారికంగా ఏదైనా చెబితేనే కానీ అప్ప‌టివ‌ర‌కూ అది కూడా రూమ‌ర్ గానే భావించాల్సి ఉంటుంది. త్రిష ప్ర‌స్తుతం కెరీర్ ప‌రంగా బిజీగా ఉన్నారు. రెండు సినిమాలు చేతిలో ఉన్నాయి.