Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్: త్రిషలో చాలా కళలున్నాయ్

By:  Tupaki Desk   |   20 April 2016 4:04 PM IST
ట్రైలర్ టాక్: త్రిషలో చాలా కళలున్నాయ్
X
త్రిషలో ఇప్పటిదాకా ఒకట్రెండు యాంగిల్సే చూశాం. ఆమెలో ఇంకా చాలా కళలున్నాయని ‘నాయకి’ సినిమా రుజువు చేసేలా ఉంది. త్రిష ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీ థియేట్రికల్ ట్రైలర్ బయటికి వచ్చేసింది. సందేహమే లేదు.. త్రిషను అభిమానించే వాళ్లకు ఈ సినిమా ఓ గిఫ్ట్ అని చెప్పొచ్చు. ట్రైలర్ అంతా ఆమె చుట్టూనే తిరిగింది. ఓ వైపు అందంగా కనిపిస్తూ కవ్విస్తూనే.. మరోవైపు దయ్యం అవతారంలో భయపెట్టే ప్రయత్నం చేసింది త్రిష. ఇక అన్ని హార్రర్ కామెడీల్లాగానే ఈ సినిమాకు కూడా కామెడీ ప్రధాన ఆకర్షణగా నిలిచేలా కనిపిస్తోంది. ట్రైలర్లో బాగానే నవ్వులు పండాయి.

సత్యం రాజేష్ హీరో కాని హీరోగా బాగానే నవ్వించే ప్రయత్నం చేసినట్లున్నాడు. ఇంకా బ్రహ్మానందంతో పాటు కామెడీ బ్యాచ్ కూడా ఉండనే ఉంది. హార్రర్ కామెడీలనగానే దాదాపుగా కథలన్నీ ఒకేలా ఉంటాయి. ‘నాయకి’ దానికి భిన్నంగా ఏమీ ఉండే అవకాశాలు కనిపించడం లేదు. కాకపోతే రొటీన్ గా ఉంటూనే నవ్వించి.. కవ్వించి.. భయపెట్టి.. ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేసేలా కనిపిస్తోంది. ఇంతకుముందు ‘లవ్ యు బంగారం’ సినిమాను రూపొందించిన గోవి.. తెలుగు-తమిళ భాషల్లో ‘నాయకి’ని రూపొందించాడు. గిరిధర్ మామిడిపల్లి నిర్మాత. టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచె ఈ చిత్రానికి సంగీతాన్నందించాడు. ఇందులో త్రిష స్వయంగా ఓ పాట కూడా పాడటం విశేషం.