Begin typing your search above and press return to search.
త్రిష.. చివరికి ఆ వేషమూ వేసేస్తోంది
By: Tupaki Desk | 19 Jan 2016 7:30 AM GMTడిమాండ్ ఉన్నపుడు హీరోయిన్లకు ‘నటనకు ప్రాధాన్యం’ ఉన్న వైవిధ్యమైన పాత్రలేమీ గుర్తుకురావు. గ్లామర్ పాత్రలే చేస్తారు. కొంచెం వైవిధ్యం ఉన్న పాత్రలేమైనా ఆఫర్ చేసినా.. నో చెప్పేస్తారు. కానీ ఒక్కసారి అవకాశాలు తగ్గగానే డీగ్లామర్ - డిఫరెంట్ రోల్స్ మీద మనసు మళ్లుతుంది. గ్లామర్ రోల్స్ చేసి బోర్ కొట్టేసింది.. వైవిధ్యం కోరుకుంటున్నా అంటూ ఎలాంటి పాత్రకైనా ఓకే చెప్పేస్తుంటారు. ఇప్పుడు త్రిష కూడా అలాగే చేస్తోంది. చీకటి రాజ్యం సినిమాలో త్రిషను ఓ షాకింగ్ అవతారంలో చూసిన జనాలు.. త్వరలోనే ‘నాయకి’గా ఆమెను మరో వైవిధ్యమైన పాత్రలో చూడబోతున్నారు. ‘కళావతి’లో దయ్యంగానూ కనిపించబోతోంది త్రిష.
ఇప్పుడు ఏకంగా పూర్తిస్థాయి నెగెటివ్ రోలే చేయడానికి రెడీ అయిపోతోంది చెన్నై చిన్నది. ధనుష్ హీరోగా నటించబోయే ‘కోడి’ సినిమాలో త్రిష ఓ పొలిటికల్ లీడర్ పాత్రలో పూర్తి స్థాయి నెగెటివ్ రోల్ చేయబోతోందట. ఇది కొంచెం నెగెటివ్ షేడ్స్ ఉన్న మంచి పాత్ర అనుకుంటే పొరబాటే. త్రిషది పూర్తిగా విలన్ పాత్రేనట. ప్రెజెంట్ లేడీ పొలిటీషియన్స్ స్ఫూర్తితో ఈ పాత్రను డిజైన్ చేశాడట దర్శకుడు దురై. ఈ పాత్ర విషయంలో చాలా ఎగ్జైట్ అయిపోతోంది త్రిష. లైఫ్ లో ఇలాంటి పాత్ర చేస్తానని ఎప్పుడూ అనుకోలేదని.. ఈ క్యారెక్టర్ గురించి దర్శకుడు చెప్పినప్పటి నుంచి.. ఎప్పుడెప్పుడు షూటింగుకి వెళ్దామా అని ఆత్రంగా ఎదురు చూస్తున్నానని త్రిష చెప్పింది.