Begin typing your search above and press return to search.

త్రిష.. పద్దతేం బాలేదమ్మాయ్‌!!

By:  Tupaki Desk   |   14 July 2016 1:30 PM GMT
త్రిష.. పద్దతేం బాలేదమ్మాయ్‌!!
X
వరుసపెట్టి తెలుగు మేకర్లకు హ్యాండిస్తోంది త్రిష. మొన్నామధ్యన ''లయన్‌'' సినిమా రిలీజైనప్పుడు కూడా.. అమ్మడు కనీసంగా కూడా సినిమాను ప్రమోట్‌ చేయలేదు. కాకపోతే ఆ సినిమా హీరో నందమూరి బాలకృష్ణ కాబట్టి.. ఆయన సినిమాకు హీరోయిన్ ప్రమోట్ చేయకపోతే జరిగే నష్టమేమీ లేదు కాబట్టి.. సరిపోయింది. కాని ఇప్పుడు ''నాయకి'' పరిస్థితి అది కాదు.

అసలు త్రిష మాత్రమే ఆ సినిమాలో స్టార్‌ ఎట్రాక్షన్‌ అనేది వేరే చెప్పక్కర్లేదు. అలాంటప్పుడు ఒక వారం పాటు ఆమె మీడియాలో హడావుడి చేస్తూ ప్రమోట్ చేస్తే. ఎట్లీస్ట్ సినిమాకు బాగా ఓపెనింగ్ అయినా వస్తుంది. ఇవన్నీ తెలిసి కూడా త్రిష కనీసం సోషల్‌ మీడియాలో కూడా నాయకి గురించి మాట్లాడట్లేదు. కనీసం రేపు (15 జూలై) నా సినిమా రిలీజ్ అనే విషయం కూడా అమ్మడు ఎక్కడా చెప్పకపోవడం గమనార్హం. అసలు ఈ పద్దతేమన్నా బాగుందా త్రిష? అసలే కెరియర్‌ ఫేడవుట్‌ దశకు చేరుకుంది.. ఈ టైములో ఇలాంటి కామెడీలు చేస్తే.. ఇక ఇప్పుడు ఎవరు అవకాశాలు ఇస్తారు??

అయినా ఆమెను తిట్టేముందు.. మన తెలుగు సినిమాల ప్రొడ్యూసర్లను కూడా తిట్టాలి. ఎందుకంటే ప్రమోషన్ అనే క్లాజ్‌ లేకుండా హీరోయిన్లను ఆవేశపడి ఆశపడి సైన్ చేసేస్తుంటే.. వారేమో ఇలా హ్యాండిస్తున్నారు. అదే బాలీవుడ్‌ లో అయితే సినిమా ఎలా వచ్చినా కూడా హీరోయిన్ ఒక నెల పాటు సినిమాను ప్రమోట్ చేయాల్సిందే. చూస్తూపోతే.. గతంలో నయనతార - ఇప్పుడు త్రిష.. మనం ఆ క్లాజ్ పెట్టకపోతే రేపు ఎవరో!!